Police Case on Babu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై గుంటూరు జిల్లాలో కేసు నమోదు.. కారణమేంటంటే..
Police Case on Babu: టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో కేసు నమోదు అయ్యింది. గుంటూరు జిల్లాలోని అరండల్ పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.
Police Case on Babu: టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో కేసు నమోదు అయ్యింది. గుంటూరు జిల్లాలోని అరండల్ పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. కరోనాపై అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారంటూ చంద్రబాబుపై న్యాయవాది పచ్చల అనిల్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరోనా పట్ల ప్రజలు భయపడేలా చంద్రబాబు, టీడీపీ నేతలు మాట్లాడారని అనిల్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనిల్ ఫిర్యాదును స్వీకరించిన అరండల్ పేట పోలీసులు.. చంద్రబాబు నాయుడిపై కేసు నమోదు చేశారు. 188, 505(1)B, 505(2) సెక్షన్ల కింద బాబుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదిలాఉండగా.. ఇటీవలే కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో చంద్రబాబు నాయుడిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబుకు నోటీసులు కూడా ఇచ్చారు కర్నూలు పోలీసులు. ఈ కేసు అలా ఉండగానే.. గుంటూరు జిల్లాలో బాబుపై తాజాగా మరో కేసు నమోదు అయ్యింది. కాగా, చంద్రబాబుపై కేసులను టీడీపీ శ్రేణులు తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వం కావాలనే తప్పుడు కేసులు పెట్టిస్తోందని ఆరోపిస్తున్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టిన ప్రజల కోసమే చంద్రబాబు పని చేస్తారని అంటున్నారు.
Also read:
Twitter Features: ట్విట్టర్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో అందుబాటులోకి రానున్న సరికొత్త ఫీచర్లు..
Driverless car: డ్రైవర్ లేకుండా రోడ్డుపై కారు..వెనుక సీట్లో యువకుడి ప్రయాణం..పోలీసులు ఏం చేశారంటే..