CM Jagan: ఆంధ్రప్రదేశ్‌కి 910 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సీజన్ కేటాయించండి.. ప్రధాని నరేంద్ర మోదీని కోరిని సీఎం వైఎస్ జగన్..
CM Jagan: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ ఉండటం.. బాధితులకు తగినంత ఆక్సీజన్ లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.
CM Jagan: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ ఉండటం.. బాధితులకు తగినంత ఆక్సీజన్ లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రాష్ట్రానికి ఆక్సీజన్ పంపాలంటూ కేంద్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరారు. ఈ మేరకు మంగళవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం జగన్ లేఖ రాశారు. ఆ లేఖలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 910 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సీజన్ కేటాయించాలని ప్రధాని మోదీని సీఎం కోరారు. అలాగే రాష్ట్రానికి 20 ఎల్ఎంఓ ట్యాంకర్లను కూడా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఒడివా నుంచి వస్తున్న 210 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను 400 టన్నులకు పెంచాలని కోరారు. చెన్నై, కర్ణాటక నుంచి రావాల్సిన ఆక్సిజన్ ఆలస్యం కావడంతో తిరుపతిలో పదకొండు మంది కరోనా బాధితులు మృతి చెందారని సీఎం జగన్ తాను రాసిన లేఖలో ప్రధాని మోదీకి వివరించారు.
తొలుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించినా.. అప్పుడు కేవలం 81 వేల యాక్టీవ్ కేసులు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుతం రాష్ట్రంలో 1.87 లక్షల యాక్టీవ్ కేసులు ఉన్నాయని సీఎం జగన్ పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సీజన్‌ను మరింత ఎక్కువగా ఏపీకి కేటాయించాలని ముఖ్యమంత్రి జగన్ తన లేఖలో ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.
Also read:
మీకు SBIలో శాలరీ అకౌంట్ ఉందా.. ఈ ప్రయోజనాలు పొందే ఛాన్స్ మీదే.. అవేంటో ఓ సారి తెలుసుకోండి..