యుద్ధ భూమి, గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం, వైమానిక దాడులు, 24 మంది పాలస్తీనీయుల మృతి, జెరూసలేంపై హమాస్ రాకెట్లవర్షం

గాజా సిటీ యుద్ధ భూమిగా మారుతోంది. తూర్పు జెరూసలేం లో ముస్లిం వర్గాలను ఖాళీ చేయించడానికి ఇజ్రాయెల్ యత్నించడంతో సీమాంతర సరిహద్దు హింస తలెత్తింది.

యుద్ధ భూమి, గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం, వైమానిక దాడులు, 24 మంది పాలస్తీనీయుల మృతి,  జెరూసలేంపై హమాస్ రాకెట్లవర్షం
Israel Air Strikes On Gaza City
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: May 11, 2021 | 7:01 PM

గాజా సిటీ యుద్ధ భూమిగా మారుతోంది. తూర్పు జెరూసలేం లో ముస్లిం వర్గాలను ఖాళీ చేయించడానికి ఇజ్రాయెల్ యత్నించడంతో సీమాంతర సరిహద్దు హింస తలెత్తింది. హమాస్ మిత్ర పక్షమైన ఇస్లామిక్ జిహాద్..జెరూసలేం లో జరిగిన ఘర్షణలకు, పోలీసుల కాల్పులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ పై రాకెట్ దాడులకు దిగింది, హమాస్ దాదాపు 200 రాకెట్లను ప్రయోగించడంతో ఇజ్రాయెల్ సైతం వైమానిక దాడులకు పూనుకొంది.గాజాపై వరుసగా బాంబులను కురిపించింది. ఈ దాడుల్లో 9 మంది పిల్లలతో సహా 24 మంది పాలస్తీనీయులు మరణించారు. జెరూసలేం లోని ఆల్-అక్సా మసీదు ప్రాంతం నుంచి, ముస్లిములు అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ తన భద్రతాదలను ఉపసంహరించాలని హమాస్ అల్టిమేటం జారీ చేసింది. అలాగే పాలస్తీనీయులతో జరిగిన ఘర్షణ ప్రాంతాల్లో కూడా తన సెక్యూరిటీ దళాలను వెనక్కి తీసుకోవాలని ఈ అల్టిమేటం లో కోరింది. గత సోమవారం జరిగిన హింసలో 700 మందికి పైగా పాలస్తీనియన్లు గాయపడ్డారు. ఏమైనా-మరికొన్ని రోజులపాటు తాము తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. మా దేశంపై రాకెట్ దాడులు జరపడం ద్వారా హమాస్ తన హద్దులను దాటిందని ఆయన ఆరోపించారు,

అటు=గాజా, జెరూసలేం పరిణామాలపై స్పందించిన ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ఎంత మాత్రం తగదని ఇజ్రాయెల్ ని హెచ్చరించింది. పాలస్తీనీయుల స్వేఛ్చకు అడ్డు రాకూడదని ఆ దేశాన్ని కోరింది. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి మార్గాలు ఉండగా దీన్ని మరింత జటిలం చేసి గాజా సిటీని యుద్ధ భూమిగా మార్చరాదని సూచించింది. గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో పలు భవనాలు, ఫ్యాక్టరీలు నాశనమయ్యాయి. శిథిలాల మధ్య తమ బిడ్డలతో సహా ప్రాణాలు దక్కించుకోవడానికి మహిళలు పరుగులు తీస్తున్న దృశ్యాలను విదేశీ మీడియా కవర్ చేసింది.

మరిన్ని ఇక్కడ చూడండి: యూపీలోని ఘాజీపూర్ లో గంగానది కలుషితం, నీటిలో తేలియాడుతున్న వందలాది మృతదేహాలు, స్థానికుల్లో భయాందోళనలు

Work From Homeకే ఉద్యోగినుల మొగ్గు…తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు