AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Police Help: తల్లి నుంచి తప్పిపోయిన డజను బాతు పిల్లలు.. పోలీసులు వచ్చి ఏం చేశారంటే..Viral Video

Police Help: సాధారణంగా మనం చేసే చిన్న చిన్న పనులు ఒక్కోసారి పదిమందినీ ఆకర్షిస్తాయి. ముఖ్యంగా సహాయం విషయంలో. మనలో ఉండే మానవత్వంతో చేసే చిన్న సహాయం ఒక్కోసారి పెద్ద ప్రచారానికి కారణం అవుతుంది.

Police Help: తల్లి నుంచి తప్పిపోయిన డజను బాతు పిల్లలు.. పోలీసులు వచ్చి ఏం చేశారంటే..Viral Video
Police Help To Ducklins
KVD Varma
|

Updated on: May 11, 2021 | 7:32 PM

Share

Police Help:  సాధారణంగా మనం చేసే చిన్న చిన్న పనులు ఒక్కోసారి పదిమందినీ ఆకర్షిస్తాయి. ముఖ్యంగా సహాయం విషయంలో. మనలో ఉండే మానవత్వంతో చేసే చిన్న సహాయం ఒక్కోసారి పెద్ద ప్రచారానికి కారణం అవుతుంది. ఇక పోలీసులు ఏదైనా చిన్న మంచి పని చేశారూ అని తెలిస్తే దానిని ప్రజలు విపరీతంగా అభినందిస్తారు. దానికి దేశాలతో బేధం ఉండదు. అలా ఇప్పుడు న్యూయార్క్ పోలీసులు చేసిన ఒక చిన్నపని నెటిజన్లను ఆకర్షించింది. వారి దయార్ద్ర హృదయాన్ని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అంతా తెగ పొగుడుతున్నారు. ఇంతకీ ఆ పోలీసులు చేసింది ఏమిటంటే..వారాంతంలో డజను బాతుల పిల్లలను రక్షించి, అవి తమ తల్లితో తిరిగి కలవడానికి సహాయపడ్డారు. ఈ పనిని మాన్హాటన్ బర్డ్ అలర్ట్ ట్విట్టర్‌లో వీడియో ద్వారా పోస్ట్ చేశారు.

ఇంతకీ వీడియోలో ఏముందంటే.. సెంట్రల్ పార్కులో ఉన్న బాతు పిల్లలు మన్హాట్ లోని అప్పర్ ఈస్ట్ సైడ్ వైపు వెళ్ళిపోయాయి. అక్కడ ఇవి తల్లి కనబడక అటూ ఇటూ కంగారుగా చూస్తూ ఉన్నాయి. అప్పుడు పోలీసులు ఈ బాతు పిల్లలను ఒక క్యారియర్‌ లో ఉంచి వాటి తల్లిదగ్గరకు తీసుకు వెళ్లి అప్పచెప్పారు. పోలీసులు క్యారియర్ లో బాతు పిల్లలను తీసుకు వెళుతుంటే తల్లి బాతు వాటి అరుపులు విని సెంట్రల్ పార్క్ కన్జర్వేటరీ వాటర్ ద్వారా వారిని అనుసరించింది. ఈ వీడియో మీరూ ఇక్కడ చూడొచ్చు..

ఇప్పుడు ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ పోలీసులను అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. మంచి పని చేశారంటూ అభినందనలతో ముంచేస్తున్నారు. కొన్ని కామెంట్లు ఇక్కడ చూడొచ్చు..