Ivermectin Drug: ఇవర్‌మెక్టిన్ డ్రగ్ వినియోగానికి గోవా ప్రభుత్వం ఆమోదం.. హెచ్చరిస్తోన్న డబ్ల్యూ.హెచ్.ఓ..
Ivermectin Drug: కరోనా కట్టడికి ఇప్పటి వరకు స్పష్టంగా ఒక ఔషధం అంటూ ఏది లేదు. వైద్యులు తమ అవగాహన మేరకు వ్యాధి లక్షణాలు తగ్గించడానికి ఉపయోగించే మందులను ఉపయోగిస్తూ...
Ivermectin Drug: కరోనా కట్టడికి ఇప్పటి వరకు స్పష్టంగా ఒక ఔషధం అంటూ ఏది లేదు. వైద్యులు తమ అవగాహన మేరకు వ్యాధి లక్షణాలు తగ్గించడానికి ఉపయోగించే మందులను ఉపయోగిస్తూ కరోనాను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవర్‌మెక్టిన్ అనే ఔషధాన్ని కొన్ని ప్రాంతాల్లో ఉపయోగిస్తున్నారు. తాజాగా సోమవారం ఈ ఔషధం వినియోగాన్ని ఆమోదిస్తూ గోవా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవర్‌మెక్టిన్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే కరోనా సోకే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఇవర్‌మెక్టిన్ డ్రగ్ వినియోగించవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ విషయమై డబ్ల్యూహెచ్ఓ ఛీఫ్ సైంటిస్ట్ డాక్టర్. సౌమ్య స్వామి నాథన్ ట్వీట్ చేశారు. ఇందులో భాగంగా సౌమ్య ట్వీట్ చేస్తూ.. వ్యాధి చికిత్సలో ఏదైనా కొత్త ఔషధాన్ని చేర్చేప్పుడు దాని పనితీరు, భద్రత చాలా ముఖ్యం. క్లినికల్ ట్రయల్స్ మినహా కోవిడ్ చికిత్సలో ఈ ఔషధాన్ని ఉపయోగించవద్దని డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసింది అంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇవర్‌మెక్టిన్ వినియోగంపై డబ్ల్యూహెచ్‌వో గతంలోనూ ఓ సారి హెచ్చరించింది. ఈ ఔషధం వినియోగం వల్ల కోవిడ్ మరణాలు తగ్గుతాయని చెప్పేందుకు కచ్చితమైన ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ గత మార్చిలో చెప్పుకొచ్చింది.
సౌమ్య స్వామి నాథన్ చేసిన ట్వీట్..
Safety and efficacy are important when using any drug for a new indication. @WHO recommends against the use of ivermectin for #COVID19 except within clinical trials https://t.co/dSbDiW5tCW
— Soumya Swaminathan (@doctorsoumya) May 10, 2021
Also Read: AP Crime News: పెళ్లికి పిలిచేందుకు వచ్చారు.. సాంతం దోచుకుని వెళ్లారు.. మాములు స్కెచ్ కాదు..
Covid Tragedy: గుంటూరు నగరంలో కరోనా కల్లోలం..ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి !