AP Crime News: పెళ్లికి పిలిచేందుకు వ‌చ్చారు.. సాంతం దోచుకుని వెళ్లారు.. మాములు స్కెచ్ కాదు..

అస్స‌లు ఎవ‌ర్నీ న‌మ్మే ప‌ని లేదు. ప్రపంచం మాయాలోకంగా మారిపోయింది. క‌రోనా వ‌చ్చి ప్ర‌పంచం అల్ల‌క‌ల్లోలం అవుతున్నా.. కొంత‌మంది కంత్రీలు మాత్రం...

AP Crime News:  పెళ్లికి పిలిచేందుకు వ‌చ్చారు.. సాంతం దోచుకుని వెళ్లారు.. మాములు స్కెచ్ కాదు..
Guntur Robbery

అస్స‌లు ఎవ‌ర్నీ న‌మ్మే ప‌ని లేదు. ప్రపంచం మాయాలోకంగా మారిపోయింది. క‌రోనా వ‌చ్చి ప్ర‌పంచం అల్ల‌క‌ల్లోలం అవుతున్నా.. కొంత‌మంది కంత్రీలు మాత్రం త‌మ పంథా మార్చ‌డం లేదు. తాజాగా గుంటూరులో జ‌రిగిన దొంగ‌తనం స్థానికుల‌ను నివ్వెర‌పోయేలా చేసింది. పెళ్లికి పిలిచేందుకు తెలిసిన‌వాళ్ల‌ ఇంటికి వచ్చి బీరువాలోని మొత్తం బంగారంతో ఉడాయించారు. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన మనీషాకు గుంటూరు వికాన్‌నగర్‌లో నివ‌శించే రాధాదేవి కుటుంబంతో పరిచయం ఉంది. అప్పుడప్పుడూ గుంటూరు వెళ్లి రాధాదేవి ఇంటికి వచ్చి క‌ష్ట‌సుఖాలు మాట్లాడి వెళ్లేవాళ్లు. ఈ క్ర‌మంలోనే ఏప్రిల్‌ 28న మనీషా తన తల్లి రూన్సీతో కలిసి గుంటూరు వికాస్‌నగర్‌లోని రాధాదేవి ఇంటికి వచ్చింది. మనీషాకు పెళ్లి కుదిరింద‌ని.. పిలవడానికి వచ్చినట్లు చెప్పారు.

ఆ రాత్రి లేట‌వ్వ‌డంతో.. అక్క‌డే ఉండి మరుసటిరోజు ఒంగోలు వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లిన తర్వాత ఇంట్లోని బీరువాని ఓపెన్ చేసి చూడ‌గా.. బంగారపు వడ్డాణం, చెవిదిద్దులు, నక్లెన్‌, పట్టుచీర మిస్ అయ్యాయి. వెంటనే రాధాదేవి పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మనీషా, ఆమె తల్లి రూన్సీలు అదుపులోకి తీసుకుని త‌మ‌దైన స్ఠైల్లో విచారించ‌గా.. చోరీ చేసిన‌ట్లు అంగీక‌రించారు. ఇద్దర్ని గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద సోమవారం అరెస్టు చేసి రూ.10 లక్షలు విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నారు. తెలిసినవాళ్లని ఇంటికి రానిస్తే ఇలా దొంగతనం చేయడంతో రాధాదేవి కుటుంబం షాక్ కు గుర‌య్యింది.

Also Read: రుయా ఆస్పత్రిలో మృతుల కుటుంబాల‌కు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్ర‌క‌టించిన సీఎం జ‌గ‌న్

‘నాలాంటి వారిని త‌లుచుకుంటే గుండె త‌రుక్కుపోతుంది’.. భార‌త క్రికెట‌ర్ బావోద్వేగ‌ పోస్ట్