Ruya Hospital: రుయా ఆస్పత్రిలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన సీఎం జగన్
తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది మృత్యువాతపడిన ఘటనపై సీఎం జగన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు....
తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది మృత్యువాతపడిన ఘటనపై సీఎం జగన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. చనిపోయినవారి కుటుంబ సభ్యులకు రూ. 10 లక్షల నష్టపరిహారం అందజేయనున్నట్లు ప్రకటించారు. కుటుంబాల వద్దకు వెళ్లి పరిహారం ఇవ్వాలని కలెక్టర్లకు సీఎం జగన్ సూచించారు.
Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy announces Rs 10 lakhs ex-gratia for the families of those who died at Ruia Hospital, Tirupati last night: Chief Minister’s Office (CMO) pic.twitter.com/ewyi8F1MOy
— ANI (@ANI) May 11, 2021
మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు. కాగా రుయా ఆస్పత్రిలో అత్యవసర వైద్య సేవలు కొనసాగుతున్నాయి. తమిళనాడు శ్రీపెరంబదూరు నుంచి మరో ఆక్సిజన్ ట్యాంకర్ వచ్చింది. 10కేఎల్ స్టోరేజ్ ట్యాంక్‌లోకి సిబ్బంది ఆక్సిజన్ నింపుతున్నారు. రోగులకు అత్యవసర వైద్య సహాయం కొనసాగుతుంది. మృతదేహాలను మార్చురీకి తరలించిన అధికారులు..మృతుల కుటుంబాలకు సమాచారం ఇచ్చారు.
Also Read: తెలంగాణలో రేపట్నుంచే లాక్ డౌన్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం