Telangana Lockdown: తెలంగాణలో రేపట్నుంచే లాక్ డౌన్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
తెలంగాణలో మే 12, బుధవారం ఉదయం 10 గంటలనుంచి పదిరోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్.....
తెలంగాణలో మే 12, బుధవారం ఉదయం 10 గంటలనుంచి పదిరోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటలనుండి 10 గంటల వరకు అన్నీ కార్యకలాపాలకు అవకాశం వుంటుందని.. ఆ తర్వాత రాష్ట్రం లాక్ డౌన్ మోడ్ లోకి వెళ్లనుంది. మరోవైపు టీకా కొనుగోలు కొరకు గ్లోబల్ టెండర్లను పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది.
మే 12, బుధవారం ఉదయం 10 గంటల నుంచి పదిరోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అవకాశం వుంటుందని నిర్ణయం తీసుకుంది. కోవిడ్ టీకా కొనుగోలు కొరకు గ్లోబల్ టెండర్లను పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది
— Telangana CMO (@TelanganaCMO) May 11, 2021
ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నీ కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. నిత్యావసరాలు, ఇతర వస్తువుల కొనుగోలుకు ఈ సమయంలో వెసులుబాటు కల్పించారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు పకడ్బంధీగా లాక్‌డౌన్ అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమయంలో అత్యవసర సేవలను మాత్రమే అనుమతించనున్నారు.
తెలంగాణ సర్కార్ ఇప్పటికే రాత్రి పూట కర్ఫ్యూను అమలు చేస్తోంది. అయినప్పటికీ వైరస్ వ్యాప్తి అదుపులోకి రాలేదు. భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఆందోళనకరంగా ఉంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్ లో చర్చించి.. లాక్ డౌన్ విధిస్తున్నట్లు తెలిపింది.
Also Read: ఐపీఎల్ మిగతా మ్యాచ్‌లకు ఈ ప్లేయర్స్ దూరం..! ఎందుకో తెలుసుకోండి..?