Veda Krishnamurthy: ‘నాలాంటి వారిని తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది’.. భారత క్రికెటర్ బావోద్వేగ పోస్ట్
మాటలకందని విషాదం..దేశాన్ని కబళిస్తోన్న కరోనా సెకండ్ వేవ్..ఎవ్వరినీ విడిచిపెట్టడం లేదు...కోవిడ్ బారినపడి సెలబ్రెటీలు సైతం కొట్టుమిట్టాడుతున్నారు.
మాటలకందని విషాదం..దేశాన్ని కబళిస్తోన్న కరోనా సెకండ్ వేవ్..ఎవ్వరినీ విడిచిపెట్టడం లేదు…కోవిడ్ బారినపడి సెలబ్రెటీలు సైతం కొట్టుమిట్టాడుతున్నారు. భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి కుటుంబంపై కోవిడ్ పగపట్టింది. మహిళా క్రికెటర్ తల్లి, అక్కా కోవిడ్ బారినపడి కన్నుమూశారు. రెండు వారాల వ్యవధిలోనే అమ్మ, అక్కను దూరం చేసుకున్న వేద కృష్ణమూర్తి భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఉద్వేగానికి లోనైన ఆమె.. ‘‘నాలాంటి బాధను అనుభవిస్తున్న వారిని తలచుకుంటుంటే గుండె తరుక్కుపోతోంది. నిజానికి మా కుటుంబం చాలా జాగ్రత్తలు పాటించింది. అయినా మహమ్మారి మా ఇంటి వరకు వచ్చిది. ఈ వైరస్ చాలా ప్రమాదకరమైంది. కాబట్టి ప్రతిఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించండి. సురక్షితంగా, ధైర్యంగా ఉండండి’’ అని విజ్ఞప్తి చేశారు.
వేద కృష్ణమూర్తి తల్లి చెలువాంబా ఏప్రిల 23న కరోనాతో మృతి చెందగా.. ఆమె అక్క వత్సల కోవిడ్‌తో మే 6న కన్నుమూశారు. వరుస విషాదాలతో ఆమె కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. వేద కృష్ణమూర్తి అమ్మ, అక్కతో తనకున్న అనుబంధాన్ని తెలియజేసేలా ట్విటర్ వేదికగా ఆమె ఓ నోట్ షేర్ చేశారు.
To my dearest Amma and Akka ❤️ pic.twitter.com/NLj7kAYQXN
— Veda Krishnamurthy (@vedakmurthy08) May 10, 2021
Also Read: రుయా ఆస్పత్రిలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన సీఎం జగన్