బీ అలర్ట్ ! కోవిడ్ 19 నివారణలో ఆవుపేడ వినియోగం మంచిది కాదు, డాక్టర్ల హెచ్చరిక, ఇతర వ్యాధులకు దారి తీస్తుందని వార్నింగ్
కోవిడ్ నివారణకు, నిరోధానికి ఆవుపేడ వినియోగించడం మంచిది కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.దీన్ని వాడడం వల్ల కోవిడ్ సోకదన్న నమ్మకానికి శాస్త్రీయ ఆధారాలు లేవని వారు చెబుతున్నారు....
కోవిడ్ నివారణకు, నిరోధానికి ఆవుపేడ వినియోగించడం మంచిది కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.దీన్ని వాడడం వల్ల కోవిడ్ సోకదన్న నమ్మకానికి శాస్త్రీయ ఆధారాలు లేవని వారు చెబుతున్నారు. పైగా దీనివల్ల ఇతర వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. దేశంలో కోవిద్ కేసులు పెరిగిపోయిన నేపథ్యంలో.. ఇది తమకు సోకకుండా చూసేందుకు గుజరాత్ లోని కొంతమంది గోశాలలకు వెళ్లి అక్కడ ఆవుపేడ, మూత్రంతో కలిపిన మిశ్రమాన్ని తమ శరీరాలకు రాసుకుంటారట. రోజూ కాకపోయినా ప్రతివారం వారు కౌ షెల్టర్లకు వెళ్లడం పరిపాటి అట.. గోశాల నిర్వాహకుడొకరు గత ఏడాది ఇలా చేసిన కారణంగానే తాను కరోనా వైరస్ బారిన పడకుండా తనను తాను రక్షించుకున్నానని తెలిపాడు. చాలామంది డాక్టర్లు కూడా ఇక్కడికి వస్తుంటారని, ఆవు పేడ రోగ నిరోధక శక్తిని పెంచుతుందని వారు కూడా చెబుతున్నారని ఆయన తెలిపాడు. అన్నట్టు వీరంతా కొద్దిసేపటి తరువాత తమ ఒంటిని పాలతో గానీ, మజ్జిగతో గానీ శుభ్రపరచుకుంటారని ఆయన చెప్పాడు.
కానీ ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది డాక్టర్లు, శాస్త్రజ్ఞులు మాత్రం ఇలా ఆవు పేడను, గోమూత్రాన్ని శరీరానికి రాసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని, కోవిడ్ కి ఇది నిరోధక శక్తిగా పని చేస్తుందనడానికి ఆధారాలు లేవని ప్రకటించారు. ఇది కేవలం నమ్మకం మాత్రమే అని వారు స్పష్టం చేశారు. ఇంతేకాదు.. దీనివల్ల హానికరమైన ఇతర జబ్బులు సంక్రమిస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. ఇండియాలో వీటిని పవిత్రంగా భావించడం నిజమే గానీ ఇమ్యూనిటీకి ఇవి దోహదపడతాయనడం అవివేకమే అవుతుందని వారు పేర్కొన్నారు. కాగా గోమూత్రం చాలా మంచిదని సాక్షి మహారాజ్ వంటి కొందరు బీజేపీ నేతలు చెబుతున్నారు..
మరిన్ని చదవండి ఇక్కడ :Viral Video : క్రికెట్ బ్యాటింగ్‌తో అదరగొట్టిన ఏనుగు ! ఐపీల్ రద్దు అందుకే నేను వచ్చాను.. వైరల్ అవుతున్న వీడియో