Laxmi Manchu: త‌న యూట్యూబ్‌ ఛాన‌ల్‌లో వ‌స్తోన్న కంటెంట్‌ను ప‌ట్టిచ్చుకోవ‌దంటున్న మంచు ల‌క్ష్మీ.. కార‌ణ‌మేంటంటే..

Laxmi Manchu youtube: హ్యాక‌ర్లు త‌మ ప్రాక్టిస్‌ను సెల‌బ్రిటీల సోష‌ల్ మీడియా అకౌంట్ల‌పైనే ప్ర‌య‌త్నిస్తుంటారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప‌లు సంఘ‌ట‌న‌లు చూస్తుంటే ఇది నిజ‌మే అనిపిస్తోంది. చాలా మంది...

Laxmi Manchu: త‌న యూట్యూబ్‌ ఛాన‌ల్‌లో వ‌స్తోన్న కంటెంట్‌ను ప‌ట్టిచ్చుకోవ‌దంటున్న మంచు ల‌క్ష్మీ.. కార‌ణ‌మేంటంటే..
Manchu Laxmi
Follow us
Narender Vaitla

|

Updated on: May 11, 2021 | 4:04 PM

Laxmi Manchu youtube: హ్యాక‌ర్లు త‌మ ప్రాక్టిస్‌ను సెల‌బ్రిటీల సోష‌ల్ మీడియా అకౌంట్ల‌పైనే ప్ర‌య‌త్నిస్తుంటారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప‌లు సంఘ‌ట‌న‌లు చూస్తుంటే ఇది నిజ‌మే అనిపిస్తోంది. చాలా మంది సినీ తారల సోష‌ల్ మీడియా అకౌంట్లు అడ‌పాద‌డ‌పా హ్యాక్ గురైన‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా ప్ర‌ముఖ న‌టి మంచు ల‌క్ష్మీ కూడా హ్యాక‌ర్ల బారిన ప‌డింది. మంచు ల‌క్ష్మీ గ‌త‌కొన్ని రోజుల క్రితం ఓ యూట్యూబ్ ఛాన‌ల్‌ను ప్రారంభించారు. ఈ ఛాన‌ల్ ద్వారా ల‌క్ష్మీ.. చిన్న పిల్ల‌ల‌కు అర్థ‌మ‌య్యేలా పాఠాలు భోధిస్తుంటారు. చిట్టి చిల‌క‌మ్మా అనే పేరుతో న‌డిపించే ఈ ఛాన‌ల్‌లో మంచు ల‌క్ష్మీ కూతురు విద్యా నిర్వాణ కూడా క‌నిపిస్తూ ఆక‌ట్టుకుంటోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ యూట్యూబ్ ఛాన‌ల్‌ అకౌంట్ హ్యాక్‌కు గురైంది. ఈ విష‌యాన్ని ల‌క్ష్మీ స్వ‌యంగా అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్న ల‌క్ష్మీ.. చిట్టి చిల‌క‌మ్మా యూట్యూబ్ ఛాన‌ల్ హ్యాకింగ్ గురైంది. ఈ పేజీలో వ‌చ్చే అంసంబంధిత కంటెంట్‌ను ప‌ట్టిచ్చుకోకండి. అకౌంట్‌ను మ‌ళ్లీ తిరిగి ప్రారంభించే ప‌నిలో మా టీమ్ స‌భ్యులు ఉన్నార‌ని ల‌క్ష్మీ ట్వీట్ చేసింది.

మంచు ల‌క్ష్మీ చేసిన ట్వీట్‌..

Also Read: Cyberabad Police: ఈసారి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫోటోను వాడేసిన సైబరాబాద్ పోలీసులు.. ఏం చేసారంటే..

పవర్ స్టార్ పవర్ ప్యాక్‏బ్లాక్ బస్టర్‏కు 9 ఏళ్ళు.. అప్పటి రికార్డులను తిరగరాసిన గబ్బర్ సింగ్..

Zombie Reddy:సీక్వెల్ కు సిద్దమవుతున్న జాంబీరెడ్డి మూవీ.. స్క్రిప్ట్ కూడా సిద్దమందట..