AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss4 winner Abhijeet: అభిజీత్ తల్లికి కరోనా పాజిటివ్.. ఎమోషనల్ అయిన బిగ్ బాస్4 విన్నర్

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు అభిజీత్. ఆతర్వాత మిర్చిలాంటి కుర్రాడు అనే సినిమా చేసాడు. ఆతర్వాత అభిజీత్ కు...

Bigg Boss4 winner Abhijeet: అభిజీత్ తల్లికి కరోనా పాజిటివ్.. ఎమోషనల్ అయిన బిగ్ బాస్4 విన్నర్
Rajeev Rayala
|

Updated on: May 11, 2021 | 4:29 PM

Share

Abhijeet: లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు అభిజీత్. ఆతర్వాత మిర్చిలాంటి కుర్రాడు అనే సినిమా చేసాడు. ఆతర్వాత అభిజీత్ కు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. దాంతో పెళ్లిగోల అనే వెబ్ సిరీస్ చేసాడు. అయితే నాగార్జున హోస్ట్ గా వ్యవరించిన రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు అభి. దాంతో ఒక్కసారిగా ఈ కుర్రాడు ఫెమస్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ లో అభిజీత్ గేమ్ ఆడిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫలితంగా అతడు సీజన్ విన్నర్ అయ్యాడు. ఇదిలా ఉంటే తాజాగా అభిజీత్ తల్లి కరోనాబారిన పడ్డారు. ఈ విషయాన్నీ అభిజీత్ స్వయంగా తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో లైవ్ ద్వారా అభిమానులతో ముచ్చటించ్చాడు. ఆసమయంలో మాట్లాడుతూ… “అమ్మకు కొవిడ్‌ పాజిటివ్‌ అన్న విషయం తెలిసింది. ఏదైతే భయపడ్డామో అదే జరిగింది. కుటుంబ సభ్యులంతా పరీక్ష చేయించుకుంటే అందరికీ నెగెటివ్‌ వచ్చింది. కాస్త ఊరటనిచ్చే విషయం ఏంటంటే అమ్మకు సీటీ లెవల్స్‌ బావున్నాయి. త్వరగానే కోలునికుంటుందని ఆశిస్తున్నా… అంటూ ఎమోషనల్ అయ్యాడు.

నా  దృష్టిలో కరోనా సోకిన వారిని ఓ గదిలో బంధించినట్లు చేయకూడదు. ఐసోలేషన్‌లో ఉండటం అనేది చెత్త విషయం. మనం దారుణమైన పరిస్థితిలో ఉన్నాం. దీని గురించి అంతగా మాట్లాడాలని లేదు.. ఎంత తక్కువ మాట్లాడడుకుంటే అంత మంచిది. నేను ఈ  టైం ను వెస్ట్ చేయకుండా బుక్స్‌ చదువుతున్నా. స్పానిష్‌ నేర్చుకుంటున్నా..ఏదైనా కొత్తగా చేయాలనుకుంటున్నా..” అని తెలిపాడు అభిజీత్

మరిన్ని ఇక్కడ చదవండి :

Cyberabad Police: ఈసారి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫోటోను వాడేసిన సైబరాబాద్ పోలీసులు.. ఏం చేసారంటే..

NTR and Mahesh: తారక్ త్వరగా కరోనా నుంచి కోలుకోవాలన్న సూపర్ స్టార్.. నెట్టింట వైరల్ అవుతున్న ట్వీట్..

పవర్ స్టార్ పవర్ ప్యాక్‏బ్లాక్ బస్టర్‏కు 9 ఏళ్ళు.. అప్పటి రికార్డులను తిరగరాసిన గబ్బర్ సింగ్..

Post-COVID Weakness: పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారా?.. హీరోయిన్ సమీరారెడ్డి చెప్పిన అద్భుతమైన చిట్కాలు మీకోసం..