NTR and Mahesh: తారక్ త్వరగా కరోనా నుంచి కోలుకోవాలన్న సూపర్ స్టార్.. నెట్టింట వైరల్ అవుతున్న ట్వీట్..

కరోనా మహమ్మారి ఎవ్వరిని వదలడం లేదు. సామాన్యుల నుంచి సినిమా తారలవరకు అందరు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు.

NTR and Mahesh:  తారక్ త్వరగా కరోనా నుంచి కోలుకోవాలన్న సూపర్ స్టార్.. నెట్టింట వైరల్ అవుతున్న ట్వీట్..
Follow us
Rajeev Rayala

|

Updated on: May 11, 2021 | 3:12 PM

NTR and Mahesh Babu:

కరోనా మహమ్మారి ఎవ్వరిని వదలడం లేదు. సామాన్యుల నుంచి సినిమా తారలవరకు అందరు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే చాలామంది కరోనా బారిన పడి కోలుకున్నారు మరి కొంతమంది కరోనా కారణంగా మరణించారు. కరోనా మహమ్మారి ఎంతోమంది సినీదిగ్గజాలను పొట్టనపెట్టుకుంది. ఇదిలా ఉంటే సినిమా తారలు వరుసగా కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ అన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్నీ తారక్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తనకు కరోనా పాజిటివ్ రావడంతో త‌న‌తో పాటు కుటుంబ సభ్యులంద‌రూ హోమ్ ఐసోలేష‌న్ లో ఉన్న‌ట్లు చెప్పారు. డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉంటూ అన్ని కోవిడ్ నియ‌మ నిబంధ‌న‌లు పాటిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. గ‌త కొన్ని రోజులుగా త‌నను కాంటాక్ట్ అయిన‌వాళ్లు వెంట‌నే టెస్టులు చేయించుకోవాల‌ని ఎన్టీఆర్ సూచించారు.  తారక్ కు పాజిటివ్ రావడంతో ఆయన అభిమానులు కొంత ఆందోళన చెందుతున్నారు. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు.

ఎన్టీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. గెట్ వెల్ సూన్ బ్రదర్ అంటూ తన ట్విట్టర్ అకౌంట్ లో మహేష్ రాసుకొచ్చారు. ఇక సినిమాఇండస్ట్రీలో మహేష్ తారక్ తో చాలా స్నేహభావంతో ఉంటారు. మహేష్ ను తారక్ అన్న అంటూ సంబోధిస్తుంటారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉండగా.. మహేష్ సర్కారు వారిపాట సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు కరోనా కారణంగా షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చాయి.

మరిన్ని ఇక్కడ చదవండి :

పవర్ స్టార్ పవర్ ప్యాక్‏బ్లాక్ బస్టర్‏కు 9 ఏళ్ళు.. అప్పటి రికార్డులను తిరగరాసిన గబ్బర్ సింగ్..

Post-COVID Weakness: పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారా?.. హీరోయిన్ సమీరారెడ్డి చెప్పిన అద్భుతమైన చిట్కాలు మీకోసం..

Zombie Reddy:సీక్వెల్ కు సిద్దమవుతున్న జాంబీరెడ్డి మూవీ.. స్క్రిప్ట్ కూడా సిద్దమందట..