AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post-COVID Weakness: పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారా?.. హీరోయిన్ సమీరారెడ్డి చెప్పిన అద్భుతమైన చిట్కాలు మీకోసం..

Post-COVID Weakness: సినీ నటి సమీరా రెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో మనందరికీ తెలిసిందే. గోవాలో ఆమె రోజువారీ జీవిత విశేషాలు,..

Post-COVID Weakness: పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారా?.. హీరోయిన్ సమీరారెడ్డి చెప్పిన అద్భుతమైన చిట్కాలు మీకోసం..
Sameera Reddy
Shiva Prajapati
|

Updated on: May 11, 2021 | 2:59 PM

Share

Post-COVID Weakness: సినీ నటి సమీరా రెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో మనందరికీ తెలిసిందే. గోవాలో ఆమె రోజువారీ జీవిత విశేషాలు, వంటలు, ఆరోగ్య చిట్కాలు వంటి విశేషాలన్నింటినీ సోషల్ మీడియాలో తన అభిమానులు, నెటిజన్లతో పంచుకుంటూ అలరిస్తుంటారు. ఒకానొక సమయంలో అతిగా బరువు పెరగడం.. మళ్లీ బరుతు తగ్గించుకున్న తీరును కూడా ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ క్రమంలోనే గత నెలలో సమీరా రెడ్డి కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. తనతో పాటు.. తన భర్త, పిల్లలు కూడా కోవిడ్ బారిన పడ్డారని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అయితే, కోవిడ్ నుంచి కోలుకునేందుకు సరైన జాగ్రత్తలు, మందులు తీసుకున్నామని, అంతకంటే ముఖ్యంగా బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం ద్వారా చాలా త్వరగా కోలుకున్నామని సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

అలాగే.. కోవిడ్ తరువాత కూడా నీరసంగా ఉండే అవకాశం ఉందని, ఆ బలహీనతలను పొగొట్టే చిట్కాలను సమీరారెడ్డి సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టా్గ్రమ్‌ ద్వారా కోవిడ్ నుంచి కోలుకున్న వారు పాటించాల్సిన ఆహార నియమాలు, సూచనలు తెలుపుతూ పోస్ట్ చేసింది సమీరా.. మరి సమీరా చెప్పిన ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం.

సమీరారెడ్డి పోస్ట్-కోవిడ్ డైట్: 1. కొబ్బరి నీళ్ళు, ఉసిరికాయ రసం, నిమ్మరసం రోజూ త్రాగాలి. 2. డేట్స్, కాలా జామున్, నానబెట్టిన బాదం మరియు ఎండుద్రాక్ష, ఉసిరికాయలు, తాజా పండ్లు తినాలి. 3. భోజనంలో బెల్లం, నెయ్యి ఉండేలా చూసుకోవాలి. 4. ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. 5. పప్పుధాన్యాలు, కిచిడి, కూరగాయలు వంటి ఆరోగ్యకరమైన పదార్థాలను మాత్రమే తినాలి. 6. తగినంత నిద్రపోవాలి. ఫోన్, టీవీని చూడటం తగ్గించుకోవడం ఉత్తమం. 7. ఉదయం సమయంలో 15 నిమిషాల పాటు ఎండలో ఉండాలి. 8. వ్యాయామాలు అతిగా చేయకూడదు. దానికి బదులుగా నెమ్మదిగా నడవటం, ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేయాలి. 9. అన్నింటికంటే ముఖ్యమైనది భావోద్వేగం. మీ భావాలను ఇతురులతో పంచుకోండి. ధైర్యంగా ఉండండి. ధైర్యమే కోవిడ్ నుంచి త్వరగా కోలుకునేలా చేస్తుంది. 10. ఆరోగ్యపరమైన సమస్యలుంటే మీరు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. అని సమీరా రెడ్డి ఇన్‌స్టాగ్రమ్‌లో పేర్కొన్నారు.

Sameera Reddy Instagram:

Also read:

Covid Vaccine: ఇప్పుడు దేశం విధానం.. అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం.. ఇప్పటివరకు ఎంతమంది టీకా తీసుకున్నారంటే..!

Indian James bond: భారతదేశపు మొదటి జేమ్స్ బాండ్ ఎవరో తెలుసా? ఇండియా ఇంటిలిజెన్స్ అత్యున్నత సంస్థ ‘రా’ వెనుక ఉన్నది ఈయనే!

6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!
ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్..
ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్..
2026లో తొలి సూర్య గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావం, తేదీ సమయం ఇదే!
2026లో తొలి సూర్య గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావం, తేదీ సమయం ఇదే!
మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఊరట.. ప్రభుత్వం కొత్త నిర్ణయం
మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఊరట.. ప్రభుత్వం కొత్త నిర్ణయం
ప్రపంచ భవిషత్తుకు పర్వత శిఖరం.. అగ్రరాజ్యాల అధ్యక్షుల నుంచి..
ప్రపంచ భవిషత్తుకు పర్వత శిఖరం.. అగ్రరాజ్యాల అధ్యక్షుల నుంచి..
మకరరాశిలో మూడు రాజయోగాలు..! ఈ 3 రాశులవారిపై సంపద వర్షం
మకరరాశిలో మూడు రాజయోగాలు..! ఈ 3 రాశులవారిపై సంపద వర్షం
టీమిండియా చెత్త ఓటమికి ఆ ఇద్దరే నిజమైన ద్రోహులు?
టీమిండియా చెత్త ఓటమికి ఆ ఇద్దరే నిజమైన ద్రోహులు?
నీటిపై ఇళ్లు.. నీళ్లే దారులు.. భారతదేశపు మిస్టరీ గ్రామం!
నీటిపై ఇళ్లు.. నీళ్లే దారులు.. భారతదేశపు మిస్టరీ గ్రామం!