AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుధీర్ బాబు బర్త్ డే… సర్‏ఫ్రైజ్ ఇచ్చిన శ్రీదేవి సోడా సెంటర్ టీం.. మరోసారి అదరగొట్టిన టాలెంటెడ్ హీరో..

Sudeer Babu: ఈరోజు అంటే మే 11న మన టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు సహా ఇతర సినీ తారలు

సుధీర్ బాబు బర్త్ డే... సర్‏ఫ్రైజ్ ఇచ్చిన శ్రీదేవి సోడా సెంటర్ టీం.. మరోసారి అదరగొట్టిన టాలెంటెడ్ హీరో..
Sudeer Babu
Rajitha Chanti
| Edited By: Team Veegam|

Updated on: May 11, 2021 | 3:25 PM

Share

Sudeer Babu: ఈరోజు అంటే మే 11న మన టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు సహా ఇతర సినీ తారలు విషెష్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్” నుంచి మేకర్స్ ఆసక్తికర గ్లింప్స్ కట్‏ను రిలీజర్ చేశారు. ఇది ఒకింత ఆసక్తిగాను మరియు ఇంటెన్స్ గా ఉందని చెప్పాలి. హిట్ చిత్రం “పలాస” దర్శకుడు కరుణ కుమార్ అందులో చూపిన టేకింగ్ ఇందులో కూడా మిస్ కాకుండా మంచి నేటివిటీలో చూపిస్తున్నట్టు అర్ధం అవుతుంది. అలాగే లైటింగ్ సూరిబాబు అనే రోల్ లో సుధీర్ బాబు కొత్తగా కనిపిస్తున్నాడు. పల్లెటూరి యువకుడిగా కనిపిస్తూనే మరోపక్క మ్యాచో బాడీతో కూడా ఆశ్చర్యపరిచాడు.

ఇప్పుడు విడుదలైన వీడియోలో నదిలో ఏదో పడవ పందెం జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. అంతేకాకుండా తిరునాళ్లలో హీరో సిగ్గు, ప్రేమ, ఫైటింగ్ అంతా చూపించారు. ఇక ఇప్పటివరకు హీరోయిన్ మాత్రం కనిపించలేదు. అలాగే ఈ గ్లింప్స్ స్టార్టింగ్ లో కనిపించిన గ్రేట్ విజువల్స్ కూడా బాగున్నాయి. మణిశర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఓవరాల్ గా మాత్రం ఈ గ్లింప్స్ మంచి ఫ్రెష్ గా ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర’ వంటి హిట్‌ సినిమాలను అందించిన విజయ్‌ చిల్లా, శశిదేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ట్వీట్..

వీడియో..

Also Read: కష్టకాలంలో ఆపన్నులకు అండగా ‘రాధేశ్యాం’ యూనిట్ . కోవిడ్ బాధితులకు సాయం అందించిన ప్రభాస్, పూజాహెగ్డే టీం…

Sonu Sood: కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు.. రియల్‌ హీరో సోనూసూద్‌ సంచలన నిర్ణయం