Sonu Sood: కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు.. రియల్‌ హీరో సోనూసూద్‌ సంచలన నిర్ణయం

Sonu Sood: దేశంలో కరోనా మహమ్మారి కాలరాస్తోంది. సెకండ్‌వేవ్‌ అతలాకుతలం చేస్తోంది. అయితే కరోనా ఫస్ట్‌వేవ్‌లో మరణాల రేటు తక్కువగా ఉండటంతో సెకండ్‌వేవ్‌ను పెద్దగా..

Sonu Sood: కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు.. రియల్‌ హీరో సోనూసూద్‌ సంచలన నిర్ణయం
Sonu Sood
Follow us

|

Updated on: May 11, 2021 | 6:10 AM

Sonu Sood: దేశంలో కరోనా మహమ్మారి కాలరాస్తోంది. సెకండ్‌వేవ్‌ అతలాకుతలం చేస్తోంది. అయితే కరోనా ఫస్ట్‌వేవ్‌లో మరణాల రేటు తక్కువగా ఉండటంతో సెకండ్‌వేవ్‌ను పెద్దగా పట్టించుకోలేదు. కానీ కరోనా దాని ప్రతాపం ఎంటో చూపిస్తోంది. సెకండ్‌ వేవ్‌లో తగిన మూల్యాన్ని చెల్లించుకుంటోంది దేశం. జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. కళ్లముందే అయిన వారిని కోల్పోతున్నా.. ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. సెకండ్‌వేవ్‌ దెబ్బకు ఆస్పత్రులే కాదు.. శ్మశానాలు కూడా ఖాళీ లేకుండా పోయాయి. మరి సెకండ్‌వేవ్‌లో ఇంత దారుణంగా ఉంటే .. థర్డ్‌వేవ్‌ ఎలా ఉంటోందో ఊహించుకుంటేనే దడ పుడుతుంది. ఇప్పుడు థర్డ్‌ వేవ్‌ రాబోతోందని నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో తెలియదు గానీ.. ప్రజల మనిషి, ఆపద్భాంధవుడు, రియల్‌ హీరో సోనూసూద్‌ మాత్రం ఇప్పటి నుంచే తన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

సెకండ్‌వేవ్‌లో ఆక్సిజన్‌ కొరతతో ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. దీనిని గమనించిన సోనూసూద్‌ థర్డ్‌వేవ్‌లో ఆక్సిజన్‌ అవసరం మరింతగా ఉండే అవకాశం ఉందని సంచలన నిర్ణయం తీసుకున్నారు సోనూసూద్‌. కోవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లను నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఫ్రాన్స్‌ నుంచి ఓ ప్లాంట్‌కు ఆర్డర్‌ చేశామని, మరో 10-12 రోజుల్లో అక్కడి నుంచి ఆక్సిజన్‌ ప్లాంట్‌ రాబోతున్నట్లు సోనూసూద్‌ తెలిపారు. అలాగే ఇంకొన్ని దేశాల నుంచి ప్లాంట్లను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు సోనూ ప్రకటించారు. ప్రస్తుతం సమయం అనేది పెద్ద సవాలుగా మారింది.. ప్రతీది సమయానికి అందించేలా మా వంతు కృషి చేస్తున్నాము. ఇక మన ప్రాణాలు కాపాడుకోగలం అని సోనూసూద్‌ తెలిపారు.

ఇవీ కూడా చదవండి:

Maharashtra Corona: మహారాష్ట్రలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..!

Corona New Variant: కరోనా కొత్త వేరియంట్లపై యుద్ధం కోసం మరో వ్యాక్సిన్ అవసరం లేదు..ఇవి సరిపోతాయి..వెల్లడించిన బయోఎన్టెక్

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి