Alia Ranbir: బీటౌన్‌లో హాట్ న్యూస్‌.. అలియా, రణబీర్‌ బ్రేకప్‌.. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే..?

బాలీవుడ్‌ లో ఎఫైర్లు, రిలేషన్‌ఫిప్స్‌, బ్రేకప్‌లు చాలా కామన్‌... కానీ ఈ సారి మాత్రం వైరల్ అవుతున్న బ్రేకప్‌ న్యూస్‌ మాత్రం ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తున్నాయి. యస్‌...

Alia Ranbir: బీటౌన్‌లో హాట్ న్యూస్‌.. అలియా, రణబీర్‌ బ్రేకప్‌.. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే..?
Ranabeer Alia
Follow us
Ram Naramaneni

|

Updated on: May 10, 2021 | 7:33 PM

బాలీవుడ్‌ లో ఎఫైర్లు, రిలేషన్‌ఫిప్స్‌, బ్రేకప్‌లు చాలా కామన్‌… కానీ ఈ సారి మాత్రం వైరల్ అవుతున్న బ్రేకప్‌ న్యూస్‌ మాత్రం ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తున్నాయి. యస్‌… బాలీవుడ్ హాట్ కపుల్‌ అలియా భట్‌, రణబీర్‌ కపూర్‌ బ్రేకప్‌ చెప్పేసుకున్నారట. ఇదే ఇప్పుడు బీటౌన్‌లో హాట్ న్యూస్‌. లాక్‌ డౌన్‌ రాకపోయుంటే ఈ జంట ఈ పాటికే ఒక్కటయ్యుండేది. కరోనా ఎఫెక్ట్‌ ఆ తరువాత రణబీర్‌ కపూర్‌ తండ్రి మరణించటంతో వీరి పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. గత ఏడాది కాలంగా కలిసే ఉంటున్న రణబీర్‌, అలియాలు ఇప్పుడు అభిప్రాయ బేధాలతో విడిపోవాలని నిర్ణయించుకున్నారన్నది వైరల్ న్యూస్‌. అయితే ఈ వార్తలన్నీ ఫేక్‌ రూమర్స్ అంటూ కొట్టి పారేస్తున్నారు ఫ్యాన్స్‌. రీసెంట్‌గా రిషీ కపూర్ ఫస్ట్‌ డెత్‌ యానివర్సరీకి ఒకే కార్‌లో వచ్చారు రణబీర్‌, అలియా. ఆ వీడియోను చూపించి వాళ్లు విడిపోతున్నారన్న వార్తలు ట్రాష్ అంటున్నారు. మరి ఈ వార్తల్లో అసలు నిజం ఎంటో తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Also Read: గంగానదిలో కొట్టుకొచ్చిన 40 మృతదేహాలు, కోవిడ్ భయంతో బీహార్ వాసుల్లో భయాందోళనలు, యూపీపై అనుమానాలు

 పెళ్లి తరువాత కూడా మారని కాజల్… వావ్ అనిపిస్తోన్న లేటెస్ట్ ఫొటోలు..