AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian- 2 Movie: ఇండియన్ 2 సినిమాకు తగ్గని సమస్యలు.. పరిష్కార బాటలో కమల్ హాసన్..

కమల్ హాసన్ ప్రధాన పాత్రలో పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా ఇండియన్ 2. ఇక ఆది నుంచి ఈ సినిమాకు అవాంతరాలు ఎదురువుతూనే ఉన్నాయి.

Indian- 2 Movie: ఇండియన్ 2 సినిమాకు తగ్గని సమస్యలు.. పరిష్కార బాటలో కమల్ హాసన్..
Kamal Haasan
Rajitha Chanti
|

Updated on: May 11, 2021 | 1:41 PM

Share

కమల్ హాసన్ ప్రధాన పాత్రలో పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా ఇండియన్ 2. ఇక ఆది నుంచి ఈ సినిమాకు అవాంతరాలు ఎదురువుతూనే ఉన్నాయి. గతేడాది చిత్రీకరణ సమయంలో ప్రమాదం జరగడంతో సినిమా షూటింగ్‌ మధ్యలోనే ఆగిపోయింది. ఇక కరోనా సంక్షోభం.. లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ చిత్రీకరణకు బ్రేక్ పడింది. ఇక ఆ తర్వాత కమల్ హాసన్.. తమిళనాడు ఎన్నికల్లో బిజీ కావడంతో ఈ సినిమా తాత్కాలికంగా ఆగిపోయింది. ఇదిలా ఉండే శంకర్ ఇటీవల తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తో సినిమాలు చేయబోతున్నట్లుగా ప్రకటించారు. దీంతో ఇండియన్ 2 చిత్ర నిర్మాణ సంస్థ శంకర్ పై మాద్రాసు కోర్టులో కేసు వేసింది. తమ సినిమా పూర్తయ్యే వరకు వేరే సినిమాలకు దర్శకత్వం వహించకుండా చూడాలని కోర్టులో పిటిషన్ వేశారు.

అయితే ఈ పిటిషన్ పై స్పందించిన కోర్టు ఈ వ్యవహరంపై స్పందిస్తూ ఇద్దరూ కలిసి కూర్చుకుని సమస్యను పరిష్కరించుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. కానీ ఆ సమస్య ఎటు తేలకుండా అక్కడే ఆగిపోయింది. అయితే తాజాగా హీరో కమల్ హాసన్ ఈ సమస్య దృష్టిసారిస్తూ పరిష్కారం చేయాలని నిర్ణయించుకున్నాడట. అటు నిర్మాతలతోపాటు దర్శకుడు శంకర్ తోనూ చర్చలు జరుపుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఇండియన్ 2 షూటింగ్ తిరిగి ప్రారంభించాలని కమల్ నిర్ణయించుకున్నాడట. ఇక అటు తమిళనాడులో ఎన్నికలు ముగియడంతో కమల్.. త్వరలోనే వీరిద్ధరితో సమావేశం కానున్నడని సమాచారం. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా.. ఇందులో కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, సముద్రఖని, వెన్నెల కిశోర్, మనోబాల తదితరులు నటిస్తున్నారు. గతంలో వీరిద్ధరి కాంబోలో వచ్చిన భారతీయుడు సినిమా సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికి ఈ సినిమా వచ్చి మే 9వ తేదీనాటికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తిచేసుకుంది.

Also Read: కష్టకాలంలో ఆపన్నులకు అండగా ‘రాధేశ్యాం’ యూనిట్ . కోవిడ్ బాధితులకు సాయం అందించిన ప్రభాస్, పూజాహెగ్డే టీం…

Sonu Sood: కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు.. రియల్‌ హీరో సోనూసూద్‌ సంచలన నిర్ణయం