కష్టకాలంలో ఆపన్నులకు అండగా ‘రాధేశ్యాం’ యూనిట్ . కోవిడ్ బాధితులకు సాయం అందించిన ప్రభాస్, పూజాహెగ్డే టీం…

RadheShyam Movie: కోవిడ్ సెకండ్ వేవ్.. దేశంలో కరాళ నృత్యం చేస్తున్న వేళ.. కరోనా బాధితులను ఆదుకునేందుకు తారలు ముందుకువస్తున్నారు.

కష్టకాలంలో ఆపన్నులకు అండగా ‘రాధేశ్యాం’ యూనిట్  . కోవిడ్ బాధితులకు సాయం అందించిన ప్రభాస్, పూజాహెగ్డే టీం…
Radhe Shyam

RadheShyam Movie: కోవిడ్ సెకండ్ వేవ్ ప్రస్తుతం దేశంలో కరాళ నృత్యం చేస్తున్న వేళ.. కరోనా బాధితులను ఆదుకునేందుకు తారలు ముందుకువస్తున్నారు. ఇప్పటికే కరోనా బాధితులకు అండగా.. సోనూసూద్ నిలవగా.. ఇటీవలే బిగ్ బీ అమితాబ్ బచ్చన్ దిల్లీలోని గురుద్వారా కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు రూ.2కోట్లు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. కేవలం బాలీవుడ్ సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా టాలీవుడ్ సెలబ్రెటీలు సైతం మేమున్నమంటూ ముందుకు వస్తున్నారు. వారికి తోచిన సహయం అందిస్తున్నారు. యంగ్ హీరోస్.. అడివి శేష్, సందీప్ కిషన్ ఇప్పటికే వివిధ రకాలుగా కోవిడ్ బాధితులకు సేవలు చేయగా.. ఇదే జాబితాలోకి ప్రభాస్, పూజా హెగ్డే టీం వచ్చి చేరింది. ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్.

తాజాగా రాధేశ్యామ్ చిత్రం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులలో బెడ్స్ కొరత కారణంగా.. రాధేశ్యామ్ సెట్స్ లో ఉపయోగించిన బెడ్స్ విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ సినిమా తుది షెడ్యూల్ హైదరాబాద్ లో జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఆలోచనను ఉపసంహరించుకుంది చిత్రయూనిట్. దీంతో చిత్రీకరణకు బ్రేక్ పడింది. ఈ షూటింగ్ లో భాగంగా బెడ్స్, స్ట్రెచర్లు, వైద్య పరికరాలతో భారీ సెట్ ఏర్పాటు చేశారు. ఇక ఈ సినిమా కోసం వేసిన ఆస్పత్రి సెట్ ప్రాపర్టీని హైదరాబాద్‌లోని ఓ కొవిడ్‌ సంరక్షణ కేంద్రానికి విరాళంగా అందించారు. ఈ విషయాన్ని ఈ చిత్ర ప్రొడక్షన్‌ డిజైనర్‌ ఆర్‌.రవీందర్‌ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో బెడ్లు,ఆక్సిజన్‌ సిలెండర్ల కొరత ఎక్కువగా ఉంది. అందుకే యూవీ క్రియేషన్స్‌ వారు హాస్పిటల్‌ సెట్‌ ప్రాపర్టీని నగరంలోని ఓ కొవిడ్‌ సంరక్షణ కేంద్రానికి విరాళంగా అందించింది. ఈ కష్టకాలంలో నిర్మాతలు చేసిన సాయం పట్ల ప్రభాస్‌ సహా.. మొత్తం చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేసిందని రవీందర్‌ రెడ్డి చెప్పారు.

రాధేశ్యామ్ సినిమా ఈ ఏడాది జూలైలో విడుదల కానుంది. పీరియాడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read: Alia Ranbir: బీటౌన్‌లో హాట్ న్యూస్‌.. అలియా, రణబీర్‌ బ్రేకప్‌.. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే..?

Sonu Sood: కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు.. రియల్‌ హీరో సోనూసూద్‌ సంచలన నిర్ణయం