AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian James bond: భారతదేశపు మొదటి జేమ్స్ బాండ్ ఎవరో తెలుసా? ఇండియా ఇంటిలిజెన్స్ అత్యున్నత సంస్థ ‘రా’ వెనుక ఉన్నది ఈయనే!

Indian James bond: గూఢచారి 116 వంటి తెలుగు సినిమాలు భలే ఇంటరెస్టింగ్ గా ఉంటాయి. ఒక గూఢచారి దేశాల హద్దులు దాటి వెళ్లి మరీ అక్కడ సాహసాలు చేసి మన దేశాన్ని రక్షించే పనిని విజయవంతంగా పూర్తి చేస్తాడు.

Indian James bond: భారతదేశపు మొదటి జేమ్స్ బాండ్ ఎవరో తెలుసా? ఇండియా ఇంటిలిజెన్స్ అత్యున్నత సంస్థ 'రా' వెనుక ఉన్నది ఈయనే!
Ramnath Kao
KVD Varma
|

Updated on: May 11, 2021 | 2:50 PM

Share

Indian James bond: గూఢచారి 116 వంటి తెలుగు సినిమాలు భలే ఇంటరెస్టింగ్ గా ఉంటాయి. ఒక గూఢచారి దేశాల హద్దులు దాటి వెళ్లి మరీ అక్కడ సాహసాలు చేసి మన దేశాన్ని రక్షించే పనిని విజయవంతంగా పూర్తి చేస్తాడు. సినిమాలో హీరో చేసే సాహసాలు చూసి ఓహో అనుకుంటూ మనం కూడా కొద్దిసేపు ఆ సినిమాలో భాగం అయిపోతాం. మరి నిజ జీవితంలో అటువంటి గూఢచారులు ఉన్నారా? ఉన్నా మనకి ఎలా తెలుస్తుంది లెండి. వాళ్ళ పని ఎవరికీ కనబడకుండా కానిస్తారు కదా. మరి మనదేశంలో అటువంటి మొట్ట మొదటి జేమ్స్ బాండ్ ఎవరో తెలుసా? ఆయన సాధించిన విజయాలు తెలుసా? మన దేశపు ఇంటిలిజెన్స్ ఏజెన్సీ రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (RAW-రా) మొదటి అధిపతి ఆయన. ఆయన పేరు రామేశ్వర్ నాథ్ కవ..ఈయనను అందరూ ఆర్ఎన్ కావా అని పిలిచేవారు. ఆయన మేనెల 10వ తేదీ 1918న ఉత్తరప్రదేశ్ లోని వారణాసి జిల్లాలో జన్మించారు. అక్కడి నుంచి ఆయన రా చీఫ్ గా ఎలా అయ్యారు? ఆయన సాధించిన విజయాలేమిటి? తెలుసుకుంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

ఆంగ్ల సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన కవ RAW (రా) ను ప్రొఫెషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీగా మార్చేశారు. ఆయన ఉత్తమ వ్యూహం కారణంగానే భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రాకు ప్రపంచవ్యాప్తంగా భిన్నమైన గుర్తింపు అలాగే అపురూప విజయం లభించింది. ఈయన చేసిన కృషి దేశ నిర్మాణానికి గణనీయంగా దోహదపడటమే కాక, భారతదేశానికి చెందిన ఈ ఏజెన్సీకి భవిష్యత్తు కోసం సురక్షితమైన దిశను అలాగే పటిష్టస్థితిని వచ్చాయి.

వారణాసి నుంచి ఇంటిలిజెన్స్ చీఫ్ దాకా..

Indian James bond: రామేశ్వర్ నాథ్ కవ ఇండియన్ పోలీస్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తరువాత ఐపీఎస్ అధికారిగా 1939 లో పదవిలో చేరారు.1947 లో దేశంలో ఇంటెలిజెన్స్ బ్యూరో స్థాపించినపుడు, పోలీసు సేవలో చేరి 8 సంవత్సరాల అనుభవం సాధించిన కవాను అక్కడికి పంపారు. అక్కడ ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరారు. ఆ సమయంలో, దేశ మాజీ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూను రక్షించే బాధ్యతను కవాకు అప్పగించారు. తదనంతరం 1968 లో, భారతదేశం వెలుపల ఇంటెలిజెన్స్ విషయాల కోసం ఒక పరిశోధన మరియు విశ్లేషణ వింగ్ (రా) ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దానికి కవాను మొదటి చీఫ్‌గా కవాను నియమించారు.

1950 లో, బ్రిటిష్ క్వీన్ యొక్క మొట్టమొదటి భారత పర్యటన సందర్భంగా, కవా ఆమె భద్రతకు బాధ్యత వహించారు. ఈ సమయంలో, ఒక కార్యక్రమంలో బ్రిటిష్ రాణి వైపు ఒకరు ఒక పూల గుత్తిని విసిరేశారు. దానిని ఆమెకు తగలకుండా నేర్పుగా పట్టుకున్నారు కావా. దీంతో ఆమె ఆయనను ప్రశంసిస్తూ ‘గుడ్ క్రికెట్’ అని వ్యాఖ్యానించారు.

కవా దాదాపు పది సంవత్సరాలు (1968 నుండి 1977 వరకు) RAW డైరెక్టర్‌గా పనిచేశారు. 1976 లో ఇందిరా గాంధీ తన పదవీకాలాన్ని పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. కావా అప్పుడు కేంద్ర మంత్రివర్గం యొక్క భద్రతా సలహాదారుగా (ఫలితంగా, మొదటి జాతీయ భద్రతా సలహాదారుగా) నియమించబడ్డారు. ఆ తరువాత భద్రతా విషయాలలో మరియు ప్రపంచ ఇంటెలిజెన్స్ విభాగం అధ్యక్షులతో సంబంధాలు ఏర్పరచుకోవడంలో అప్పటి ప్రధాని (రాజీవ్ గాంధీ) కు ప్రత్యేక సలహాదారుగా పనిచేశారు. కవా జీవితం, ఆయన పని తీరుపై కూడా చాలా పుస్తకాలు వెలువడ్డాయి. వీటిలో ఆర్ఎన్ కావ్-జెంటిల్మాన్ స్పైమాస్టర్, కౌబాయ్స్ ఆఫ్ రా వంటి ప్రాచుర్యం పొందిన పుస్తకాలు ఉన్నాయి.

Indian James bond కవాకు సంబంధించిన 10 ముఖ్యమైన విషయాలు

  • భవిష్యత్ భద్రతా సమస్యలను పరిష్కరించడానికి పాలసీ మరియు పరిశోధనా సిబ్బందికి కవా పునాది వేశారు.
  • కొంతమంది బంగ్లాదేశ్ సైనిక అధికారులు తనపై తిరుగుబాటుకు కుట్ర చేస్తున్నారని కవా అప్పటి బంగ్లాదేశ్ అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్ ను అప్రమత్తం చేశారు.
  • 2017 లో, ఉపాధ్యక్షుడు వెంకయ్య నాయుడు తన ప్రసంగంలో, కవాను దేశంలోని గొప్ప ఐపిఎస్ అధికారులలో ఒకరని అభివర్ణించారు.
  • కవా జీవితంపై ఒక సినిమా తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 2020 లో ధర్మ ప్రొడక్షన్ అండ్ స్టిల్ అండ్ స్టిల్ మీడియా గ్రూప్ ఈ విషయంలో సమాచారం ఇచ్చింది.
  • 1950 ల మధ్యలో, ‘కాశ్మీర్ యువరాణి’కి సంబంధించిన దర్యాప్తు అలాగే, 1971 లో బంగ్లాదేశ్ విముక్తికి సహకారం వంటి కేసులలో కవా పాల్గొన్నారు.
  • కవా రెండు తరాల రాకు గూఢచర్య లక్షణాలను నేర్పించారు. ఆయన బృందాన్ని కవా బాయ్స్ అని పిలిచేవారు.
  • భారతదేశంలోని ముగ్గురు ప్రధానమంత్రులకు కవా దగ్గరి సలహాదారు అలాగే భద్రతా అధిపతి.
  • 1962 లో చైనాతో భారతదేశం వివాదం తరువాత స్థాపించబడిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సెక్యూరిటీ (డిజిఎస్) వ్యవస్థాపకులలో ఆయన ఒకరు.
  • 1950 వ దశకంలో, పండిట్ నెహ్రూ అభ్యర్థన మేరకు ఘనా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఫారిన్ సర్వీస్ రీసెర్చ్ బ్యూరో) ఏర్పాటుకు సహాయం చేశారు.
  • కవా సమర్థవంతమైన నాయకత్వం, ఆతని బృందం సమర్థవంతమైన వ్యూహం కారణంగా 3000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం
  • భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. సిక్కిం భారతదేశ 22 వ రాష్ట్రంగా అవతరించింది.

కవా సామర్థ్యం

జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ చైర్మన్ కెఎన్ దారువాలా రాసిన ఒక నోట్ ఆర్ఎన్ కవా యొక్క సామర్థ్యాన్ని వెల్లడిస్తుంది. ”ప్రపంచవ్యాప్తంగా ఆయన పరిచయాలు కొంత భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆసియా, ఆఫ్ఘనిస్తాన్, చైనా అలాగే ఇరాన్లలో. వారు కేవలం ఒక ఫోన్‌తో పనిని పూర్తి చేయగలరు. భారతదేశంలో సర్వసాధారణమైన ఇంటర్ డిపార్ట్‌మెంటల్ పోటీని ముగించిన జట్టు నాయకుడు ఆయన.” అంటూ దారువాలా నోట్ రాశారు. కవా 20 జనవరి 2002 న మరణించారు. భారతదేశం కవా వేసిన ఇంటిలిజెన్స్ పునాదుల మీదే ఈరోజుకూ నడుస్తోంది.

Also Read: Telangana Cabinet Live: తెలంగాణ‌లో రేప‌టి నుంచి లాక్‌డౌన్‌.. కేవ‌లం నాలుగు గంట‌లు మాత్రమే స‌డ‌లింపు..

Telangana Lockdown: తెలంగాణ‌లో రేప‌ట్నుంచే లాక్ డౌన్.. తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం