AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zombie Reddy:సీక్వెల్ కు సిద్దమవుతున్న జాంబీరెడ్డి మూవీ.. స్క్రిప్ట్ కూడా సిద్దమందట..

ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో మంచి విజయం సాధించిన సినిమా జాంబీ రెడ్డి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Zombie Reddy:సీక్వెల్ కు సిద్దమవుతున్న జాంబీరెడ్డి మూవీ.. స్క్రిప్ట్ కూడా సిద్దమందట..
Rajeev Rayala
|

Updated on: May 27, 2021 | 9:58 PM

Share

Zombie Reddy : ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో మంచి విజయం సాధించిన సినిమా జాంబీ రెడ్డి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జ హీరోగా నటించిన మొదటి సినిమా ఇది. ‘అ!’ అనే డిఫరెంట్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ సినిమాకు నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించాడు. విభిన్నమైన కథ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ తో ‘కల్కి’ అనే సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమాకూడా ప్రేక్షకులను మెప్పించింది. ప్రశాంత్ మూడో మూవీగా ‘జాంబీరెడ్డి’ని రూపొందించాడు. ఈ సినిమా ఇండియాలోనే ఫస్ట్ జాంబిస్ మూవీ కావడం విశేషం.

ఫుల్ ఫన్ తో పాటు థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కించాడు ప్రశాంత్. అయితే ఈ సినిమాకు త్వరలో సీక్వెల్ తెరకెక్కబోతుంది తెలుస్తుంది. నిజానికి సినిమా సక్సెస్ అయితే సీక్వెల్ తెరకెక్కిస్తానని ముందే చెప్పాడు ప్రశాంత్. ఇప్పుడు ‘జాంబీరెడ్డి’ కి సీక్వెల్ తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే సినిమా కోసం సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. అయితే  జాంబీరెడ్డి సినిమాలో నటించిన నటీనటులే ఈ సీక్వెల్ లోను నటిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే వెల్లడించనున్నారని ఫిలింనగర్ టాక్.

మరిన్ని ఇక్కడ చదవండి :

Indian- 2 Movie: ఇండియన్ 2 సినిమాకు తగ్గని సమస్యలు.. పరిష్కార బాటలో కమల్ హాసన్..

Ananya Nagalla Video : కుర్రోళ్ళ న్యూ క్రష్ .. మల్లేశం తో ఎంట్రీ వకీల్ సాబ్ తో ట్రెండ్.!

కష్టకాలంలో ఆపన్నులకు అండగా ‘రాధేశ్యాం’ యూనిట్ . కోవిడ్ బాధితులకు సాయం అందించిన ప్రభాస్, పూజాహెగ్డే టీం…

Sai Pallavi: కాళికాదేవిగా త్రిశూలం పట్టిన సాయి పల్లవి.. భయపెడుతోన్న ఫస్ట్ లుక్…. ( వీడియో )