AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wines Shops Rush: తెలంగాణలో లాక్‌డౌన్ ప్రకటించిన సర్కార్.. వైన్ షాపులకు పరుగు పెడుతున్న మందుబాబులు..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్ అట్ల ప్రకటించిందో లేదో.. వైన్స్ షాపుల వద్ద మద్యం బాబులు బారులు తీరారు. హైదరాబాద్ మహానగరంలో ఎటు చూసిన మద్యం దుకాణాల వద్ద రద్దీ పెరిగింది.

Wines Shops Rush: తెలంగాణలో లాక్‌డౌన్ ప్రకటించిన సర్కార్.. వైన్ షాపులకు పరుగు పెడుతున్న మందుబాబులు..!
Wines Shops Rush
Balaraju Goud
|

Updated on: May 11, 2021 | 3:47 PM

Share

Wines Shops Growing Rushed: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్ అట్ల ప్రకటించిందో లేదో.. వైన్స్ షాపుల వద్ద మద్యం బాబులు బారులు తీరారు. హైదరాబాద్ మహానగరంలో ఎటు చూసిన మద్యం దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. రాష్ట్రంలో మళ్లీ లాక్ డౌన్ విధించినట్లు ప్రకటన వెలువడిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే మందు బాబులు వెంటనే అలర్ట్ అయ్యారు. పూర్తిస్థాయి లాక్ డౌన్‌ను విధిస్తే వైన్ షాపులు కూడా మూత పడతాయి. కాబట్టి, ముందస్తుగానే మద్యం కొనుక్కుని ఇంట్లో పెట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. వైన్ షాపులకు వెళ్లే వారిలో చాలా మంది ఫుల్ బాటిల్స్ కొనుక్కుని వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో మద్యం దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. ఈసందర్భంగా అటు వ్యాపారులు, ఇటు కొనుగోలుదారులు కోవిడ్‌ నిబంధ నలు పాటించడం లేదు. అధికారులు ఆంక్షలు విధించినప్పటికి షాపుల వద్ద వీటిని ఎవరూ పట్టించుకోవడంలేదు.

రాష్ట్రంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ భయానకంగా విజృంభిస్తుందని చెబుతున్నా.. మందుబాబులు మాత్రం కొనుగోలుకు ఏ మాత్రం వెనకడుగు వెయ్యటం లేదు. ఇక మద్యం షాపుల వద్ద కరోనా వైరస్ ప్రబలకుండా సోషల్ డిస్టెన్స్ పాటించాలని , మాస్కులు ధరించాలని , ఒకరికి ఒకరు తాకవద్దని చెప్పి పలు నిబంధనలు ఉన్నా లెక్క చేయడంలేదు. ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడిన క్షణాల్లోనే మందుబాబులు భారీగా మద్యం షాపుల ముందు క్యూ కట్టారు.

గత ఏడాది కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో మద్యం షాపులు కూడా మూతపడ్డాయి. సుమారు రెండు నెలల తర్వాత రాష్ట్రాల విజ్ఞప్తి, ఖజానాకు ఆదాయం తగ్గిన నేపథ్యంలో కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది. ఆ తర్వాత మద్యం ధరలు కూడా కొంత మేర పెరిగాయి. అప్పట్లో రెండు నెలల పాటు మద్యం దొరక్క మందుబాబులు లిక్కర్ విత్ డ్రాయల్ సిండ్రోమ్‌లాంటి సమస్యలను కూడా ఎదుర్కొన్నారు. మందుబాబుల డిమాండ్‌ను కొందరు క్యాష్ చేసుకున్నారు. రెండు, మూడు రెట్లు ఎక్కువ ధరలకు అడ్డదారిలో మద్యాన్ని విక్రయించారు. ఈ సారి అలాంటి పరిస్థితి లేకుండా ముందస్తుగానే మద్యం స్టాక్ పెట్టుకోవడానికి లిక్కర్ ప్రియులు వైన్ షాపులకు పరుగుపెడుతున్నారు.

Read Also… Covid Tragedy: గుంటూరు న‌గ‌రంలో కరోనా కల్లోలం..ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి !