Coronavirus: హోటల్స్, స్కూల్స్, కాలేజీలను ఐసోలేషన్ సెంటర్లుగా మార్చాలి.. రాష్ట్ర ప్రభుత్వానికి భట్టి విక్రమార్క డిమాండ్..

Coronavirus: కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నాడు భట్టి విక్రమార్క జూమ్..

Coronavirus: హోటల్స్, స్కూల్స్, కాలేజీలను ఐసోలేషన్ సెంటర్లుగా మార్చాలి.. రాష్ట్ర ప్రభుత్వానికి భట్టి విక్రమార్క డిమాండ్..
Follow us
Shiva Prajapati

|

Updated on: May 11, 2021 | 3:40 PM

Coronavirus: కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నాడు భట్టి విక్రమార్క జూమ్ ద్వారా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి ముఖ్యమంత్రి కేసీఆరే కారణం అని ఆరోపించారు. ప్రతి మండలానికి, నియోజకవర్గానికి ఐసొలేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో ఐఏఎస్ అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్, బెడ్లు, మెడిసిన్, వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలన్నారు. రాష్ట్రంలో హోటల్స్ , స్కూల్స్, కాలేజ్‌లను ఆధీనంలోకి తీసుకొని ఐసోలేషన్ సెంటర్లుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రతీ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో 30 మంది కరోనా పేషెంట్లకు బెడ్లను ఏర్పాటు చేసేవిధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తంగా విస్తృతంగా ఉన్న నేపథ్యంలో కనీసం 15 రోజుల పాటు లాక్‌ డౌన్ విధించాలన్నారు. కొన్ని గ్రామాలు ఇప్పటికే స్వచ్ఛందంగా లాక్ డౌన్ పెట్టుకుంటున్నాయ్ అని అన్నారు. సెకండ్ వేవ్‌పై ప్రభుత్వాన్ని తాము ముందే హెచ్చరించినా.. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. ఢిల్లీ తరహాలో ‘యాప్‌ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వానికి భట్టి విక్రమార్క సూచించారు. ఆ యాప్ ద్వారా బెడ్లు, ఆక్సిజన్ ఎక్కడెక్కడ ఉన్నాయో అందరికీ తెలిసేలా చర్యలు చేపట్టాలన్నారు. అన్ని పనులను పక్కన పెట్టి యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ చేపట్టాలన్నారు.

Also read:

Vaccination: అమెరికాలో 12-15 సంవత్సరాల మధ్య వయసు పిల్లలకు టీకా ఇవ్వడానికి రంగం సిద్ధం

Telangana Cabinet Live: తెలంగాణ‌లో రేప‌టి నుంచి లాక్‌డౌన్‌.. కేవ‌లం నాలుగు గంట‌లు మాత్రమే స‌డ‌లింపు..

Asaram Bapu: ఆయుర్వేద చికిత్స తీసుకుంటా.. నాకు బెయిల్ ఇప్పించండి.. కోర్టును వేడుకున్న ఆశారాం బాపూజీ