Covid Tragedy: గుంటూరు న‌గ‌రంలో కరోనా కల్లోలం..ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి !

కరోనా మహమ్మారి సృష్టిస్తోన్న‌ చేస్తోన్న క‌ష్టాలు అన్నీ, ఇన్నీ కావు. మ‌న‌సును క‌దిలించే ఘ‌ట‌న‌లు ఈ కోవిడ్ వ్యాప్తి స‌మ‌యంలో అనేకం చూశాం. తాజాగా...

Covid Tragedy:  గుంటూరు న‌గ‌రంలో కరోనా కల్లోలం..ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి !
Corona
Follow us
Ram Naramaneni

|

Updated on: May 11, 2021 | 3:41 PM

కరోనా మహమ్మారి సృష్టిస్తోన్న‌ చేస్తోన్న క‌ష్టాలు అన్నీ, ఇన్నీ కావు. మ‌న‌సును క‌దిలించే ఘ‌ట‌న‌లు ఈ కోవిడ్ వ్యాప్తి స‌మ‌యంలో అనేకం చూశాం. తాజాగా గుంటూరు నగరంలో నివసించే ఓ కుటుంబంలో కల్లోలం రేపింది. 20 రోజుల వ్యవధిలో ఐదుగురిని మ‌హ‌మ్మారి బలి తీసుకోగా… ఆ కుటుంబంలో మిగిలినవారు తీవ్ర ఆక్రంద‌న‌లో ఉన్నారు. టీచ‌ర్ గా పనిచేసి రిటైర్ మహ్మద్ ఫరుద్దీన్ షా… కుటుంబంతో సహా A.T.అగ్రహారంలోని శ్రీరామనగర్‌లో నివసించేవారు. కుమార్తెకు, ఇద్దరు కుమారులకు పెళ్లిళ్లు చేశారు. ఉన్నంతలో స‌ర్దుకుపోయి.. కలిసిమెలసి ఆనందంగా జీవించే ఆ కుటుంబాన్ని..కరోనా కోలుకోలేని రీతిలో దెబ్బతీసింది.

గత నెల 4వ తేదీ నుంచి 29 మధ్య ఫరుద్దీన్‌తోపాటు ఆయన కుమార్తె, తల్లి, కుమారుడు, భార్య వరుసగా క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. మరణించిన ఏ ఒక్కరూ మరొకరి మృతి గురించి తెలియకుండానే కన్నుమూయడం.. మ‌న‌సుల‌ను మెలిపెట్టే విష‌యం. ట్రీట్మెంట్ తీసుకుంటున్న‌ సమయంలో చెబితే మరింత ప్రమాదమని…వారికి విషయం తెలియజేయలేదు.ప్రస్తుతం ఫరుద్దీన్ చిన్న కుమారుడు జిలానీ కుటుంబం, వదిన గౌసియా, ఆమె పిల్లలు తీవ్ర మ‌నోవేధ‌న‌లో ఉన్నారు. కుటుంబంలో కరోనా రేపిన క‌ల్లోలాన్ని వారు జీర్ణించుకోలేక‌పోతున్నారు. వైద్య ఖర్చుల కోసం రూ. 20 లక్షల వరకూ అప్పు చేశారు. పుట్టెడు కష్టంలో ఉన్న తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

Also Read: తెలంగాణ‌లో రేప‌ట్నుంచే లాక్ డౌన్.. తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

రుయా ఆస్పత్రిలో మృతుల కుటుంబాల‌కు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్ర‌క‌టించిన సీఎం జ‌గ‌న్

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!