Andhra Corona Updates: ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్స ఫీజులు నిర్ణయిస్తూ జ‌గ‌న్ స‌ర్కార్ ఉత్త‌ర్వులు

ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్స ఫీజు నిర్ణయిస్తూ జ‌గ‌న్ స‌ర్కార్ జీవో జారీ చేసింది. సాధారణ కొవిడ్ చికిత్సకు ఎన్​ఏబీహెచ్​ ఆస్పత్రుల్లో...

Andhra Corona Updates:  ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్స ఫీజులు నిర్ణయిస్తూ జ‌గ‌న్ స‌ర్కార్ ఉత్త‌ర్వులు
Ap Government

ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్స ఫీజు నిర్ణయిస్తూ జ‌గ‌న్ స‌ర్కార్ జీవో జారీ చేసింది. సాధారణ కొవిడ్ చికిత్సకు ఎన్​ఏబీహెచ్​ ఆస్పత్రుల్లో రోజుకు రూ.4 వేలుగా… ఎన్​ఏబీహెచ్​ ఆమోదం లేని ఆస్పత్రుల్లో రోజుకు రూ. 3,600 గా ఫీజును ఫైన‌ల్ చేసింది. సాధారణ కొవిడ్ చికిత్స, ఆక్సిజన్ కలిపి ఎన్‌ఏబీహెచ్ ఆస్పత్రుల్లో రూ.6,500 ఫీజును.. ఎన్‌ఏబీహెచ్ ఆమోదం లేని ఆస్పత్రుల్లో రూ.5,850 ఫీజు నిర్ణయించింది. క్రిటికల్, ఐసీయూ, ఎన్‌ఐవీ ట్రీట్మెంట్ కు ఎన్‌ఏబీహెచ్‌ ఆస్పత్రుల్లో రూ.12 వేలు, ఎన్‌ఏబీహెచ్‌ ఆమోదం లేని హాస్పిట‌ల్స్ లో రూ.10,800గా నిర్ణయించారు. ఐసీయూ (వెంటిలేటర్) ట్రీట్మెంట్ కు ఎన్‌ఏబీహెచ్ ఆస్పత్రుల్లో రూ.16 వేలు, ఎన్‌ఏబీహెచ్ ఆమోదం లేని ఆస్పత్రుల్లో రూ.14,400 ఫీజు ను నిర్ణ‌యించింది. ఈ మేరకు ఫీజులను వెల్లడిస్తూ. ఏపీ స‌ర్కార్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఏపీలో కొన‌సాగుతున్న క‌రోనా తీవ్ర‌త‌

రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 20,345 కరోనా కేసులు, 108 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 14,502 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 1,95,102 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.

Also Read: లాక్ డౌన్ నేప‌థ్యంలో హైద‌రాబాద్ మెట్రో రైళ్ల‌ వేళల్లో మార్పులు.. తాజా టైమింగ్స్ ఇవే

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. పదో తరగతి విద్యార్థులను పాస్ చేస్తూ జీవో జారీ..