కరోనాతో మరణిస్తే ఎల్ఐసీ పాలసీ వర్తిస్తుందా? లేదా? ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలిపిన LIC

LIC Policy cover COVID-19: కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. వైరస్ మహమ్మారి కారణంగా వేల సంఖ్యలో జనం మృత్యువాతపడుతున్నారు. అయితే కరోనాతో మరణిస్తే ఎల్ఐసీ పాలసీ వర్తిస్తుందా? లేదా? అన్న అనుమానాలు...

కరోనాతో మరణిస్తే ఎల్ఐసీ పాలసీ వర్తిస్తుందా? లేదా? ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలిపిన LIC

కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. వైరస్ మహమ్మారి కారణంగా వేల సంఖ్యలో జనం మృత్యువాతపడుతున్నారు. అయితే కరోనాతో మరణిస్తే ఎల్ఐసీ పాలసీ వర్తిస్తుందా? లేదా? అన్న అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. అయితే.. దీనిపై గతంలోనే LIC క్లారిటీ ఇచ్చింది. తమ వినియోగదారుల శ్రేయస్సు కోసం ఎల్లవేళలా కట్టుబడి ఉన్నామని సంస్థ ధీమా వ్యక్తం చేసింది.

ఇతర మరణాలతో పాటు, కరోనా చనిపోయినా LIC పాలసీ వర్తిస్తుంది. మృతుల కుటుంబ సభ్యులు LIC పాలసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని గతంలోనే స్పష్టం చేసింది LIC. ఈ పాలసీ క్లెయిమ్ చేసుకునే ప్రాసెస్‌లో కూడా ఎలాంటి మార్పు లేదు. సాధారణంగా పాలసీ ఎలా క్లెయిమ్ చేసుకుంటారో కోవిడ్ 19 కారణంగా మరణించినవారి కుటుంబ సభ్యులు అదే పద్ధతిలో పాలసీ క్లెయిమ్ చేసుకోవచ్చు.

కరోనా వైరస్ కారణంగా ఎవరైనా మరణిస్తే, LIC పాలసీలో మరణించిన వ్యక్తి పేర్కొన్న నామినీ డెత్ క్లెయిమ్ సమాచారం, మరణ ధృవీకరణ పత్రం, పాలసీ షెడ్యూల్ కాపీని మీ సమీప బ్రాంచ్ కార్యాలయంలో సమర్పించాలి. కరోనా కారణంగా మీ దగ్గరలోని సమీప శాఖ పనిచేయకపోతే నామినీలు డెత్ క్లెయిమ్ ఇంటిమేషన్, మరణ ధృవీకరణ పత్రం, పాలసీ షెడ్యూల్‌ కాపీని ఎల్‌ఐసీ నోడల్ వ్యక్తికి ఈ-మెయిల్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి:  Telangana Lockdown: తెలంగాణ‌లో క‌ఠినంగా లాక్ డౌన్.. ప్ర‌జ‌ల‌కు కీల‌క సూచ‌న‌లు చేసిన పోలీస్ శాఖ‌

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో విజృంభిస్తున్న కరోనా వైరస్.. 24 గంటల్లో 20 వేలకు పైగా నమోదైన పాజిటివ్ కేసులు..