Telangana Lockdown: తెలంగాణ‌లో క‌ఠినంగా లాక్ డౌన్.. ప్ర‌జ‌ల‌కు కీల‌క సూచ‌న‌లు చేసిన పోలీస్ శాఖ‌

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనుననుసరించి లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాల‌ని తెలంగాణ‌ డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసు ఉన్న‌తాధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు...

Telangana Lockdown: తెలంగాణ‌లో క‌ఠినంగా లాక్ డౌన్.. ప్ర‌జ‌ల‌కు కీల‌క సూచ‌న‌లు చేసిన పోలీస్ శాఖ‌
Telangana-Police
Follow us
Ram Naramaneni

|

Updated on: May 11, 2021 | 8:36 PM

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనుననుసరించి లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాల‌ని తెలంగాణ‌ డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసు ఉన్న‌తాధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. సీనియర్ అధికారులు క్షేత్ర స్థాయిలో ఉండి పర్యవేక్షించాలని సూచించారు. లాక్ డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి విడుదలయ్యే ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని స్ప‌ష్టం చేశారు. హైదరాబాద్ తోపాటు అన్ని ప్రధాన నగరాలు, జిల్లా హెడ్ క్వార్టర్లు, ప్రధాన నగరాలలో పటిష్టంగా అమలు చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేసేవారికి ఈ- పాస్ విధానం ద్వారా సంబంధిత కమీషనర్లు, ఎస్.పీలు పాసులను జారీ చేస్తారని స్పష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా పోలీస్ శాఖ వారు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఆ వివ‌రాలు ఇవిగో…

* రాష్ట్రం లో వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు, ధాన్యం సేకరణ, రవాణా లపై ఏవిధమైన ఆంక్షలు లేలు.

* జాతీయ రహదారులపై రవాణా పై ఏవిధమైన ఆంక్షలు లేవు.

* ప్రధాన రంగంలో ఉన్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తమ అక్రిడేషన్లు కానీ, పత్రికా పరమైన గుర్తింపు కార్డులు తమవెంట ఉంచుకోవాలని స్పష్టం.

* గ్రామాల్లో వ్యవసాయ సంబంధిత పనులు, ఉపాధిహామీ పనులను లాక్ డౌన్ నుండి మినహాయింపు.

* ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు వారి శాఖా పరమైన గుర్తింపు కార్డులుంటే సరిపోతుంది.

* రాష్ట్రం లో జరిగే వివాహాలకు ఇరువైపుల చెందిన 40 మంది మాత్రమే హాజరయ్యేవిధంగా చూడాలి.

* వివాహలకు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలి.

* మరణాలకు సంబంధించి కేవలం 20 మంది మాత్రమే హాజరు కావాలి.

* కరోనా వాక్సినేషన్ కు ఎవరైనా వెళ్లాల్సివస్తే వారి మొదటి డోస్ కు సంబందించిన సమాచారం సెల్ ఫోన్ లో చూసి వారికి సడలింపు ఇవ్వాలి.

* నిత్యావసర వస్తువుల రవాణా సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

* నిత్యావసర వస్తువుల రవాణా, ఇతర ఎమర్జెన్సీ సేవలకు సంబంధించి స్థానికంగా సమయాలను పేర్కొంటూ ప్రత్యేక పాసులను జారీ చేయాలి.

* ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం తో పాటు ఐపీసీ ప్రకారం తగు కేసులు నమోదు చేయాలి.

Also Read:  తెలంగాణ‌లో మ‌రికొద్ది గంటల్లో అమ‌ల్లోకి లాక్‌డౌన్‌.. ఈ రంంగాల‌కు పూర్తిగా మిన‌హాయింపు..

 తెలంగాణలో లాక్‌డౌన్ ప్రకటించిన సర్కార్.. వైన్ షాపులకు పరుగు పెడుతున్న మందుబాబులు..!