Lock Down In Telangana: తెలంగాణలో మరికొద్ది గంటల్లో అమల్లోకి లాక్‌డౌన్.. వేటికి అనుమతి ఉంటుంది.. వేటికి ఉండదు..?
Lock Down In Telangana: దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా కట్టడికి లాక్‌డౌన్ విధించిన వేళ తెలంంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఓవైపు హైకోర్టు కూడా లాక్‌డౌన్ ఎందుకు విధించడం...
Lock Down In Telangana: దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా కట్టడికి లాక్‌డౌన్ విధించిన వేళ తెలంంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఓవైపు హైకోర్టు కూడా లాక్‌డౌన్ ఎందుకు విధించడం లేదంటూ ప్రశ్నించిన నేపథ్యంలో మంగళవారం తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రగతి భవన్‌లో మూడు గంటల పాటు క్యాబినెట్ చర్చించింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మే 12 (బుధవారం) నుంచి లాక్‌డౌన్ అమల్లోకి రానున్నట్లు ప్రకటించారు. ఇక ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రం కొన్ని కార్యకలాపాలకు సడలింపులు ఇస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది. దీంతో రోజులో 20 గంటలపాటు లాక్ డౌన్ అమల్లోకి రానుంది. ఈ నెల 20న మరోసారి క్యాబినెట్ భేటీ నిర్వహించనున్నారు. లాక్‌డౌన్ కొనసాగించడమా లేదా అన్న దాని గురించి ఈ భేటీలో చర్చించనున్నారు. ఇక కేబినేట్ మీటింగ్‌లు తీసుకున్న పలు కీలక నిర్ణయాలు, లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చిన రంగాలపై ఓ లుక్కేయండి..
క్యాబినెట్ మీటింగ్‌లో తీసుకున్న పలు కీలక నిర్ణయాలు..
* రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరతను తీర్చే క్రమంలో గ్లోబల్ టెండర్లు పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది.
* ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో రెమిడిసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్, ఇతర కరోనా మందులను అందుబాటులోకి తేవాలని, వీటి కొరత రాకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను క్యాబినెట్ ఆదేశించింది.
* రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంత్రుల అధ్యక్షతన కలెక్టర్, డీఎంహెచ్ఓ, జిల్లా కేంద్రంలోని దవాఖానా సూపరింటెండెంట్, డ్రగ్ ఇన్ స్పెక్టర్లతో కమిటీ వేయాలని నిర్ణయం. ప్రతి రోజూ ఆయా జిల్లాల మంత్రులు వారి వారి జిల్లా కేంద్రాల్లో కరోనాపై సమీక్ష చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
* రెమిడిసివర్ ఇంజక్షన్ ఉత్పత్తిదారులతో క్యాబినెట్ సమావేశం నుంచే ఫోన్‌లో మాట్లాడిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్రానికి తగినన్ని మందులను సరఫరా చేయాలని కోరారు.
* మందులు, వ్యాక్సిన్లను వేగవంతంగా సమకూర్చి, సరఫరా చేయడం కోసం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్ నియామకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ రంగాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు..
* రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ ఫ్యాక్టరీలు ఇలా అన్ని రకాల వ్యవసాయం రంగాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు.
* ధాన్యం కొనుగోళ్లు యథావిధిగా కొనసాగుతాయి.
* జాతీయ రహదారుల మీద పెట్రోల్ పంపులు తెరిచే ఉంటాయి.
* ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మినహాయిపు.
* ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయి.
* వంట గ్యాస్ సరఫరాకు మినహాయింపు.
* బ్యాంకులు, ఏటీఎంలు యథావిధిగా పనిచేస్తాయి.
* అనుమతులతో జరిపే పెళ్లిళ్లకు గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతి.
* అంత్యక్రియల సందర్భంలో గరిష్టంగా 20 మందికి మాత్రమే అనుమతి.
* ఫార్మాస్యూటికల్ కంపనీలతోపాటు మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు, అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, వారి వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వాహనాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు.
* గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ యథావిధిగా కొనసాగుతుంది.
* ఉపాధిహామీ పనులు యథావిధిగా కొనసాగుతాయి.
* ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో పనిచేస్తాయి.
Police Help: తల్లి నుంచి తప్పిపోయిన డజను బాతు పిల్లలు.. పోలీసులు వచ్చి ఏం చేశారంటే..Viral Video
Telangana Crime News: కరోనా నివారణ మందులు అని చెప్పి, మత్తు టాబ్లెట్స్ ఇచ్చారు.. కట్ చేస్తే..