AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Massive Alligator: నదిలో చేపలు పడుతున్న వ్యక్తి పైకి అకస్మాత్తుగా వచ్చిన భారీ మొసలి..తరువాత ఏం జరిగిందంటే..Viral Video

Massive Alligator: ఒక వ్యక్తి చేపలు పడుతున్నాడు. చలా ప్రశాంతంగా. కొద్దిసేపటి తరువాత నీటినుంచి ఓ భారీ మొసలి అకస్మాత్తుగా బయటకు వచ్చింది.

Massive Alligator: నదిలో చేపలు పడుతున్న వ్యక్తి పైకి అకస్మాత్తుగా వచ్చిన భారీ మొసలి..తరువాత ఏం జరిగిందంటే..Viral Video
Massive Alligator
KVD Varma
|

Updated on: May 11, 2021 | 8:20 PM

Share

Massive Alligator: ఒక వ్యక్తి చేపలు పడుతున్నాడు. చలా ప్రశాంతంగా. కొద్దిసేపటి తరువాత నీటినుంచి ఓ భారీ మొసలి అకస్మాత్తుగా బయటకు వచ్చింది. అది ఆ చేపలు పడుతున్న వ్యక్తిని వెంబడించింది. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఈ సంఘటన ఫ్లోరిడాలో జరిగింది.

అసలేం జరిగిందంటే..

ఫ్లోరిడాలోని ఓ నదివద్ద..టామీ లీ అనే వ్యక్తి మే 8 న ఎవర్‌గ్లేడ్స్‌లో ఫిషింగ్ టార్పాన్‌లతో చేపలు పడుతున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా ఓ మొసలి తల నీటి ఉపరితలంపై కనిపించింది. ఈ మొసలి(Massive Alligator) ఒడ్డుకు వచ్చి తనపని పట్టేలా ఉందని గ్రహించిన టామీ “ఓ జీసస్ క్రైస్ట్” అనుకుంటూ వెనక్కి వెళ్ళడం మొదలు పెట్టాడు. ఇంతలో ఆ 11 అడుగుల భారీ మొసలి ఒడ్డుకు చేరుకొని అతన్ని వెంబడించడం ప్రారంభించాడు. టామీ శరీరానికి అనుసంధానించబడిన గోప్రో కెమెరాలో చిక్కింది. ఆ మొసలి ఇతనిని వెంబడించడం.. అతను వెనక్కి తిరిగి దానిని అదిలించే ప్రయత్నం చేయడం అంతా ఈ వీడియోలో చూడొచ్చు. మొత్తమ్మీద ఆ భారీ మొసలి నుంచి తప్పించుకుని బయట పడ్డాడు టామీ. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.. ఆ వీడియో ఇక్కడ చూడొచ్చు..

ఈ క్లిప్ ఇప్పుడు ఫేస్బుక్ – ట్విట్టర్లలో విస్తృతంగా చక్కర్లు కొట్టింది. ఇది యూట్యూబ్‌లో వేలాది వీక్షణలను కూడా సంపాదించింది.

ప్రస్తుతం ఫ్లోరిడాలోని మొసళ్ళకు సంభోగం కాలం. ఒక నెల క్రితం, ఫ్లోరిడా కాంప్లెక్స్ వద్ద 10 అడుగుల పొడవైన మొసలిని కారు కింద నుండి ట్రాపర్లు రక్షించారు. మార్చి 31 న ఉదయం 8:45 గంటలకు హిల్స్‌బరో కౌంటీ షెరీఫ్ కార్యాలయం మొసళ్ళ సంచారం గురించి హెచ్చరించిన తరువాత ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మొసలిని ఎలిగేటర్ ఫామ్‌కు రవాణా చేయడానికి షెరీఫ్ విభాగం ”ఎలిగేటర్ ట్రాపర్” ను పంపించింది. హిల్స్‌బరో కౌంటీ షెరీఫ్ కార్యాలయం యొక్క ఫేస్‌బుక్ పేజీలో పంచుకున్న ఒక బాడీక్యామ్ ఫుటేజ్ లో చాలా మంది ఈ పెద్ద మొసలి నోరు కట్టివేసి ట్రక్ వెనుకకు ఎత్తివేస్తూ ఈ వీడియోలో కనిపించారు.

Also Read: Police Help: తల్లి నుంచి తప్పిపోయిన డజను బాతు పిల్లలు.. పోలీసులు వచ్చి ఏం చేశారంటే..Viral Video

Ananya Nagalla Video : కుర్రోళ్ళ న్యూ క్రష్ .. మల్లేశం తో ఎంట్రీ వకీల్ సాబ్ తో ట్రెండ్.!