AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: బాబోయ్.. బాహుబలి పుట్టగొడుగు.. బరువు ఎంత తూగిందో తెలిస్తే బిత్తరపోతారు

పుట్టగొడుగుల (మష్రూమ్) కూరంటే ఇష్టపడని వారంటూ ఉండరు.. వీటిని పలు రకాలుగా వండుకుని.. ఇష్టంగా ఆరగిస్తారు.. అయితే.. పుట్టగొడుగులు అనగానే అందరూ చాలా చిన్నవిగా ఉంటాయనుకుంటారు. వాస్తవానికి పుట్టగొడుగులు.. కేజీకి 10 నుంచి 20 వస్తుంటాయి.. సైజును బట్టి తుగుతాయి.. పుట్టగొడుగులు అన్ని కేజీగా తుగడం మనం చూస్తూనే ఉంటాం..

Andhra: బాబోయ్.. బాహుబలి పుట్టగొడుగు.. బరువు ఎంత తూగిందో తెలిస్తే బిత్తరపోతారు
Mushroom
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Jul 26, 2025 | 2:05 PM

Share

పుట్టగొడుగుల (మష్రూమ్) కూరంటే ఇష్టపడని వారంటూ ఉండరు.. వీటిని పలు రకాలుగా వండుకుని.. ఇష్టంగా ఆరగిస్తారు.. అయితే.. పుట్టగొడుగులు అనగానే అందరూ చాలా చిన్నవిగా ఉంటాయనుకుంటారు. వాస్తవానికి పుట్టగొడుగులు.. కేజీకి 10 నుంచి 20 వస్తుంటాయి.. సైజును బట్టి తుగుతాయి.. పుట్టగొడుగులు అన్ని కేజీగా తుగడం మనం చూస్తూనే ఉంటాం.. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది బాహుబలి పుట్టగొడుగు గురించి.. అవును అరుదైన పుట్టగొడుగు ఏకంగా.. కేజీన్నర పైగానే తూగింది. నేచురల్ గా పండిన పుట్టగొడుగు.. దాదాపు కేజీన్నర పైనే ఉందంటే దాని ఆకారం ఏ రకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.. ఈ జంబో పుట్టగొడుగుకు సంబంధించిన వివరాలు తెలుసుకోండి..

ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి మండలం రామరెడ్డి పల్లె గ్రామంలో ఈ అరుదైన పుట్టగొడుగు పండింది. రామిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన బోరెడ్డి నరసింహారెడ్డి పొలంలో ప్రకృతి సిద్ధంగా మొలిచిన ఈ పుట్టగొడుగు కేజీ 760 గ్రాములు బరువు తూగింది. ఇది చూడడానికి భారీగా ఉంది. సాధారణంగా మనం బయట కొనే పుట్టగొడుగులు కేజీ 750 గ్రాములంటే.. ఒక పెద్ద కవర్ నిండా వస్తాయి. దాదాపు ఓ 15 నుంచి 20 వరకు వస్తాయి.. అయితే.. ఈ పుట్టగొడుగు ఒక్కటే.. పెద్ద కవర్ నిండటం చూసి ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.

వీడియో చూడండి..

గతంలో కూడా ఇలాంటి పుట్టగొడుగు ఇదే వేంపల్లి మండలంలో మనకు కనిపించాయి.. అవి కేజీ 500 గ్రాములు ఉంటే ఇది మరో 250 గ్రాములు అదనంగానే ఉంది. ప్రకృతి ఆధారంగా పండే ఈ పంటలు ఇక్కడ సహజసిద్ధంగా పండుతున్నాయి. నిత్యం పండవు వానలు పడే కాలంలో లేదా చలికాలంలో ఇలాంటి జంబో పుట్టగొడుగులు అక్కడక్కడ దర్శనమిస్తూ ఉంటాయని స్థానిక రైతులు పేర్కొంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..