Andhra: వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు.. ఏపీకి వచ్చే 3 రోజులు భారీ రెయిన్ అలెర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం తీరం దాటింది. దీంతో ఏపీలో కోస్తా జిల్లాలతో పాటు తెలంగాణకు వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది

నిన్నటి వాయుగుండం గత 6 గంటల్లో గంటకు 28 కి.మీ వేగంతో పశ్చిమ దిశగా కదిలి, జూలై 26న ఉదయం 8.30 గంటలకు ఉత్తర ఛత్తీస్‌గఢ్ దాని పరిసర ప్రాంతాలపై, దాదాపుగా 23.3°ఉత్తర అక్షాంశం, 84.0°తూర్పు రేఖాంశం ల దగ్గర కేంద్రీకృతమై ఉంది. డాల్టన్‌గంజ్ (జార్ఖండ్)కి దక్షిణంగా 80 కి.మీ., అంబికాపూర్ (ఛత్తీస్‌గఢ్)కి తూర్పున 80 కి.మీ.. పెంద్రా రోడ్ (ఛత్తీస్‌గఢ్)కి తూర్పు ఈశాన్యంగా 220 కి.మీ. ఉమారియా (మధ్యప్రదేశ్)కి తూర్పున 320 కి.మీ. దూరంలో ఉంది. ఇది ఉత్తర ఛత్తీస్‌గఢ్, తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా దాదాపు పశ్చిమ దిశగా కదులుతూ, జూలై 27, 2025 నాటికి క్రమంగా బలహీనపడి బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉంది.
ఈశాన్య అరేబియా సముద్రం నుండి ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా జార్ఖండ్ దాని పరిసర ప్రాంతాల మీద గల వాయుగుండం కేంద్రం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ఉన్న నిన్నటి ద్రోణి ఈరోజు తక్కువగా గుర్తించబడినది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు..
—————————————————————————————————-
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :- ————————————————
ఈరోజు :- ————————————-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది . ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40-50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
రేపు, ఎల్లుండి:- ————————-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:- ——————————–
ఈరోజు :- —————————-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది
రేపు, ఎల్లుండి:- ————————-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది
రాయలసీమ :- ——————-
ఈరోజు :- —————————-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది
రేపు, ఎల్లుండి:- ————————-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




