Goa Governor: గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు ప్రమాణస్వీకారం… దర్బార్ హాల్‌లో బాధ్యతల స్వీకరణ
గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు బాధ్యతలు స్వీకరించారు. గోవా గవర్నర్ బంగ్లా దర్బార్ హార్‌లో ప్రమాణస్వీకారం చేశారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే శనివారం ఉదయం 11.30 గంటలకు అశోక్ గజపతిరాజుతో ప్రమానం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు...

గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు బాధ్యతలు స్వీకరించారు. గోవా గవర్నర్ బంగ్లా దర్బార్ హార్‌లో ప్రమాణస్వీకారం చేశారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే శనివారం ఉదయం 11.30 గంటలకు అశోక్ గజపతిరాజుతో ప్రమానం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గోవా ప్రభుత్వ పెద్దలు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ పాల్గొన్నారు.
అంతకు ముందు గోవా చేరుకున్న అశోక్ గజపతి రాజుకు ఘనస్వాగతం లభించింది. గోవా చీఫ్ సెక్రటరీ కాండేవేవు,, డిజిపి శ్రీ అలోక్ కుమార్, పలువురు గోవా ప్రజా ప్రతినిధులు అశోక్ గజపతి రాజుకు ఘన స్వాగతం పలికారు.
విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించారు అశోక్ గజపతి రాజు. వివాదరహితుడైన రాజకీయవేత్తగా ఆయనకు పేరుంది. గతంలో ఏడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో విజయనగరం ఎంపీగా విజయం పొందారు. మోదీ క్యాబినెట్‌లో విమానయానశాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. మహారాజా అలక్‌నారాయణ విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారు అశోక్ గజపతి రాజు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. గతంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అశోక్ గజపతి రాజు కొనసాగారు. ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్‌లలో కీలక మంత్రిత్వ శాఖలను నిర్వర్తించారు.
అశోక్ గజపతి రాజుకు క్లీన్ ఇమేజ్ ఉంది. అయితే వయోభారంతో 2024 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వ వచ్చినప్పటి నుంచి.. ఆయనకు సరితూగే పదవి తప్పక వస్తుందనే ప్రచారం జరిగింది. ఎట్టకేలకు గోవా గవర్నర్‌గా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడంతో అశోక్ గజపతి రాజుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.




