Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pandugappa Fish: అబ్బ.. జాలరి పంట పండింది.. పండుగప్ప రేటు ఎంతో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..

Konaseema district news: జాలరి ఆశతో వల వేశాడు.. అదృష్టం చేప రూపంలో వేల రూపాయలను తెచ్చిపెట్టింది. తాజాగా.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరో పండుగప్ప చేప దొరికింది.

Pandugappa Fish: అబ్బ.. జాలరి పంట పండింది.. పండుగప్ప రేటు ఎంతో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..
Fish
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 10, 2023 | 5:30 AM

Konaseema district news: జాలరి ఆశతో వల వేశాడు.. అదృష్టం చేప రూపంలో వేల రూపాయలను తెచ్చిపెట్టింది. తాజాగా.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరో పండుగప్ప చేప దొరికింది. మత్స్యకారుల వలకు చిక్కిన ఈ భారీ పండుగప్ప చేపను రాజోలు మండలం తాటిపాక చేపల మార్కెట్‌కు తీసుకొచ్చారు. భారీ పండుగప్ప చేపను చూసి వినియోగదారులు, వ్యాపారులు ఆశ్చర్యపోయారు. 16 కేజీల బరువు ఉన్న ఈ పండుగప్ప చేపను వేలంలో పెట్టగా భారీగా డిమాండ్ ఏర్పడింది. చివరకు 12వేల రూపాయలకు చేజిక్కించుకున్నారు చేప ప్రియుడు కాసు. తనకు ఈ చేపంటే చాలా ఇష్టమని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

సముద్రంలో మాత్రమే దొరికే ఈ పండుగప్ప చేప.. రుచిలో రారాజు. రేటులోను మెనగాడే. ఇదిలాఉంటే.. ఈనెల 5వ తేదీన కోనసీమ జిల్లాలో ఐ.పోలవరం మండలం భైరవపాలెంలో దీనికన్నా ఎక్కువ బరువున్న.. భారీ పండుగప్ప చేప మత్స్యకారుల వలకు చిక్కింది. ఇది దాదాపు 25 కేజీల బరువు ఉంది. దీన్ని కొందరు వ్యాపారులు కలిసి కొనుగోలు చేశారు. వాళ్లు మరికొంత లాభం వేసుకుని దీన్ని అమ్మేశారని స్థానికులు తెలిపారు. సాధారణంగా రెండు కేజీల నుంచి 10.. 20 కేజీలు.. అంతకుమించి బరువు ఉండే ఈ పండుగప్ప చేపలు సముద్రంలో అరుదుగా దొరుకుతుంటాయని మత్య్సకారులు పేర్కొన్నారు.

Fish1

Fish

గతంలో 20,15 కేజీల పండుగప్ప చేపలు దొరకగా ఇప్పుడు 25 కేజీల వరకు దొరకడంతో మత్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పండుగప్ప చేప సముద్రంతో పాటు నదుల్లో కూడా దొరుకుతుంది. శుభకార్యాలలో పులస పులుసు తరహాలో పండుగప్ప చేప కూర, వేపుడు ముక్కల వంటకాలను మాంస ప్రియులు ఎంతో ఇష్టంగా తింటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

రూ 7 కోట్ల డైమండ్ చెవి దిద్దులు కొట్టేసి.. గుట్టుగా మింగేసి ??
రూ 7 కోట్ల డైమండ్ చెవి దిద్దులు కొట్టేసి.. గుట్టుగా మింగేసి ??
ఒంటరిగా చూస్తే వణుకు పుట్టి చస్తాం.. బెస్ట్ హార్రర్ ఫిల్మ్‌!
ఒంటరిగా చూస్తే వణుకు పుట్టి చస్తాం.. బెస్ట్ హార్రర్ ఫిల్మ్‌!
హాట్ టాపిక్‌గా నాగబాబు ఆస్తుల విలువ! కోట్లలో స్థిర, చరాస్తులు
హాట్ టాపిక్‌గా నాగబాబు ఆస్తుల విలువ! కోట్లలో స్థిర, చరాస్తులు
రష్మిక పేరిట నయా రికార్డ్! అట్లుంది ఈమె కథ!
రష్మిక పేరిట నయా రికార్డ్! అట్లుంది ఈమె కథ!
పెంపుడు కుక్క అస్తికలు నదిలో కలుపుతూ.. కన్నీరు పెట్టుకున్న రష్మి.
పెంపుడు కుక్క అస్తికలు నదిలో కలుపుతూ.. కన్నీరు పెట్టుకున్న రష్మి.
చడీచప్పుడు కాకుండా గుడ్‌న్యూస్‌తో షాకిచ్చిన నటి!
చడీచప్పుడు కాకుండా గుడ్‌న్యూస్‌తో షాకిచ్చిన నటి!
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవులు ఎప్పటి నుంచో తెలుసా..?
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవులు ఎప్పటి నుంచో తెలుసా..?
పెళ్లయిన రెండో రోజే షాకిచ్చిన వధువు.. లబోదిబోమన్నవరుడు
పెళ్లయిన రెండో రోజే షాకిచ్చిన వధువు.. లబోదిబోమన్నవరుడు
ఐడియా అదిరింది.. కరెంట్‌ అక్కర్లేని ఏసీ.. చల్ల చల్లని కూల్ కూల్
ఐడియా అదిరింది.. కరెంట్‌ అక్కర్లేని ఏసీ.. చల్ల చల్లని కూల్ కూల్
ఆనందంగా పెళ్లి ఊరేగింపు.. అంతలోనే ప్రమాదం వీడియో
ఆనందంగా పెళ్లి ఊరేగింపు.. అంతలోనే ప్రమాదం వీడియో