Tirumala: తిరుమల అడవుల్లో అగ్ని ప్రమాదం.. శ్రీవారి పాదాలు, శిలాతోరణం దగ్గర చెలరేగిన మంటలు..
తిరుమల కొండల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శ్రీవారిపాదాలు, శిలాతోరణం దగ్గర మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన టీటీడీ అధికారులు, ఫైర్ సిబ్బంది.. రెండు ఫైరింజన్లతో కష్టం మీద మంటలు అదుపు చేశారు. హటాత్తుగా జరిగిన ఈ అగ్నిప్రమాదంతో శ్రీవారి భక్తులు ఉల్కిపడ్డారు. శ్రీవారిపాదాలు, శిలాతోరణం ప్రాంతాల్లోని పచ్చని అడవి అగ్నికి ఆహుతైంది.

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు వెలసిన తిరుమల శేషాచల కొండల్లో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీవారి పాదాలకు వెళ్ళే దారిలో ఉన్న కొండల్లో మంగళవారం మంటలు చెలరేగాయి. శిలాతోరణం, శ్రీవారిపాదాల దగ్గర అటవీ ప్రాంతలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ విషయంపై సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే ఫైరింజన్ల సాయంతో ప్రమాద స్థలానికి చేరుకున్నది. రెండు ఫైరింజన్ల సమయంలో అడవిలోని మంటలను నియంత్రించింది. అయితే అప్పటికే 100 మీటర్ల మేర అడవి అగ్నికి ఆహుతి అయ్యింది. అగ్ని ప్రమాదంతో ఆ మార్గంలో వెళ్తున్న భక్తులు భయాందోళనకు గురయ్యారు. అయితే మంటలు చెలరేగడానికి గల కారణాలు ఏంటనేదీ తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర ఉందా? లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.
శ్రీవారి భక్తులు తిరుమలకు అలిపిరి, శ్రీవారి పాదాలు ఈ రెండు ద్వారా నడుచుకుంటూ చేరుకుంటారు. ఈ శ్రీవారి పాదాలు పురాణాల ప్రకారం.. స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామీ నడిచిన మార్గం అని.. మొదట కాలు పెట్టిన ప్రాంతం ఇదేనని నమ్మకం. శ్రీవారి పాదముద్రలే అందుకు సజీవ సాక్షం.. అందుకనే ఈ మెట్ల మార్గాన్ని శ్రీవారి పాదాలు అని అంటరాని నమ్మకం. శ్రీవారి దర్శనానికి వెళ్ళే చాలా మంది భక్తులు ప్రకృతి సహజ అందాలను వీక్షించేందుకు అలాగే శ్రీవారి పాదాలను స్పశించి తక్కువ సమయంలోనే శ్రీవారి చెంతకు చేరుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో ఇక్కడకు వస్తారు. శ్రీవారి పాదాల చెంతకు యాత్రికులు టీటీడీ ఏర్పాటు చేసిన ఉచిత బస్సు లేదా ప్రైవేట్ టాక్సీల ఆర్టీసీ బస్సు, ఆటోల ద్వారా చేరుకోవచ్చు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..