Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu states: ఫోన్ మాట్లాడటం ఎక్కువైందని మందలించిన ఫేరెంట్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య!

ఎక్కువగా ఫోన్‌ మాట్లాడుతున్నారని తల్లిదండ్రులు మందలించడంతో.. మనస్తాపానికి గురైన ఇద్దరు అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన తెలుగురాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో వెలుగు చూసింది. తల్లిదండ్రులు తిట్టారని హైదరాబాద్‌లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోగా.. అనమ్మయ్య జిల్లాలో మరో అమ్మాయి కూడా ఇదే కారణంచేత బలవన్మరణానికి పాల్పడింది. క్షణికావేశంలో వారు తీసుకున్న నిర్ణయం ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

Telugu states: ఫోన్ మాట్లాడటం ఎక్కువైందని మందలించిన ఫేరెంట్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య!
Follow us
Anand T

|

Updated on: Jun 10, 2025 | 4:30 PM

ప్రస్తుత జనరేషన్ పిల్లలు చాలా సున్నితంగా ఉంటున్నారు. చిన్న చిన్న విషయాలకే మస్తాపాకి గురై ప్రాణాలు తీసుకుంటున్నారు. ఏ చిన్న సమస్య ఎదురైనా దానికి చావే పరిష్కారం అన్న విధంగా ప్రవర్తిస్తున్నారు. పరీక్షలో ఫెయిల్ అయినా, లవ్‌లో ఫెయిల్ అయిన, తల్లి దండ్రులు తిట్టినా.. స్కూల్‌లో చీటర్‌ తిట్టినా.. ఇలా చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యకు చేసుకుంటున్నారు. తాజాగా ఇంటాంటి ఘటనలే తెలుగురాష్ట్రాల్లో చోటుచేసుకున్నాయి. ఫోన్ ఎక్కువగా మాట్లాడుతున్నారని తల్లిదండ్రులు మందలించడంతో.. మనస్తాపానికి గురైన ఇద్దరు అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు కోల్పోయారు. క్షణికావేశంలో వారు తీసుకున్న నిర్ణయం ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

హైదరాబాద్‌లో యువతి తేజస్విని ఆత్మహత్య..

హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్‌ సుభాష్ నగర్‌లో నివాసం ఉంటున్న రాజేష్ కుమార్ అనే వ్యక్తికి తేజస్విని (19) అనే కూతురి ఉంది. తేజస్విని స్థానికంగా ఉన్న గౌతమి జూనియర్ కాలేజ్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. అయితే ఈ మధ్య కాలంలో తేజస్వినీ ఎక్కువగా ఫోన్‌లో మాట్లాడుతున్నట్టు తల్లిదండ్రులు గమనించారు. తాజాతా ఈ నెల 8వ తేదీన రాత్రి 11 గంటల సమయంలో తేజస్విని ఫోన్ మాట్లాడటాన్ని గుర్తించిన తల్లిదండ్రులు ఫోన్ వాడకం ఎక్కువైందని, తగ్గించుకోవాలని తేజస్వినీని మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తేజస్విని, తర్వాతి రోజు తల్లిదండ్రులు పనికి వెళ్లిన తర్వాత ఇంట్లోని ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పని నుంచి ఇంటికి వచ్చి కూతురిని చూసిన తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అన్నమయ్య జిల్లాలో మస్తానీ అనే బాలిక ఆత్మహత్య..

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నివాసం ఉంటున్న గఫూర్, హసీనా దంపతులకు కుమార్తె మస్తానీ (16) అనే కుమార్తె ఉంది. మస్తానీ స్థానికంగా ఉన్న స్కూల్‌లో ఎనిమిదో తరగతి వరకు చదువుకుని ప్రస్తుతం ఇంట్లో ఉంటోంది. అయితే, ఈ మధ్య మస్తానీ కూడా ఎక్కువ ఎక్కువగా ఫోన్‌ మాట్లాడుతున్నట్టు గమనించిన తల్లి హసీనా మస్తానీని మందలించింది. దీంతో తీవ్ర ఆవేదనకుగురైన మస్తానీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో బాత్రూంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మస్తానీ మరణించినట్టు వైద్యులు నిర్దారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో
ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో
మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో
మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో
పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో
పచ్చగడ్డిపై చెప్పుల్లేకుండా నడవండి.. ఫలితం మీరే చూడండి వీడియో
పచ్చగడ్డిపై చెప్పుల్లేకుండా నడవండి.. ఫలితం మీరే చూడండి వీడియో
బందర్‌లో దృశ్యం మార్క్‌ క్రైమ్‌ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్
బందర్‌లో దృశ్యం మార్క్‌ క్రైమ్‌ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్
భారత్‌కు వచ్చేసిన స్టార్‌లింక్‌... మరింత చౌకగా హైస్పీడ్‌ ఇంటర్నెట
భారత్‌కు వచ్చేసిన స్టార్‌లింక్‌... మరింత చౌకగా హైస్పీడ్‌ ఇంటర్నెట
హనీమూన్‌లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో
హనీమూన్‌లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో
యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో
యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో
70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో
70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో