AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దూసుకొచ్చిన మృత్యు శకటం.. కొత్త బట్టలు, సరుకుల కోసం వచ్చి, ముగ్గురు మృతి!

దసరా పండుగ ఆ కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పల్లె నుండి పట్టణానికి వచ్చిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. దసరా పండుగ రోజు సరదాగా గడిపేందుకు కొత్త బట్టలు, సరుకుల కోసం వెళ్ళి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఈ విషాద సంఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. పత్తికొండ పట్టణం గుత్తి సర్కిల్ సాయిబాబా గుడి రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది.

దూసుకొచ్చిన మృత్యు శకటం.. కొత్త బట్టలు, సరుకుల కోసం వచ్చి, ముగ్గురు మృతి!
Road Accident
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Sep 30, 2025 | 4:35 PM

Share

దసరా పండుగ ఆ కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పల్లె నుండి పట్టణానికి వచ్చిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. దసరా పండుగ రోజు సరదాగా గడిపేందుకు కొత్త బట్టలు, సరుకుల కోసం వెళ్ళి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఈ విషాద సంఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. పత్తికొండ పట్టణం గుత్తి సర్కిల్ సాయిబాబా గుడి రోడ్డులో పండుగ సరుగుల కోసం వచ్చిన ముగ్గురు అనుకోని ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటన శిరీష, భూమిక, మితుకలు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

తుగ్గలి మండలం ముక్కెళ్ల గ్రామానికి చెందిన శిరీష, భూమిక, మితుకలు పండుగ సరుకుల కోసం పత్తికొండకు వచ్చారు. పండుగ, సరుకులు తీసుకుని తమ గ్రామమైన ముక్కెళ్ల గ్రామానికి వెళ్లడానికి ఆటోలో బయలుదేరారు. అప్పుడే బియ్యం లోడుతో మిట్టపై వెళ్తున్న లారీ వేగంగా వచ్చింది. బ్రేకులు ఫెయిలవడంతో పైభాగం నుండి కింది భాగంలో ఉన్న ఆటోలను లారీ ఢీకొట్టింది. దీంతో శిరీష భూమిక, మితుకలు అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

భూమిక కుమార్తె మితుక, కుమారుడితో పండుగ సరుకుల కోసం కుటుంబంతో వచ్చింది. భూమిక అమె కూతురు మితుక చనిపోగా, ఏడాది వయస్సు ఉన్న బాబు బ్రతికి బయటపడ్డాడు. చనిపోయిన భార్య భూమిక, కూతురు మితుకలను చూసిన భర్త సుమన్ తల్లిడిల్లిపోయాడు. ఒకేసారి చనిపోవడంతో కన్నీరు మున్నీరు అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..
తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం.. ఒడిశా, బెంగాల్‌లో భారీ వర్షాలు..
తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం.. ఒడిశా, బెంగాల్‌లో భారీ వర్షాలు..
కరివేపాకు రోజూ తింటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలుంటే మాత్రం జాగ్రత్త!
కరివేపాకు రోజూ తింటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలుంటే మాత్రం జాగ్రత్త!
ఈ 5 రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగ కల నెరవేరనుందట! మీ రాశి కూడా..
ఈ 5 రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగ కల నెరవేరనుందట! మీ రాశి కూడా..