AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Marriage: ఎల్లలు దాటిన ఫేస్ బుక్ ప్రేమ.. చిత్తూరు యువకుడిని పెళ్లి చేసుకున్న శ్రీలంక యువతి.. ట్విస్ట్ ఏమిటంటే..

విఘ్నేశ్వరి, తాపీ మేస్త్రీ లక్ష్మణ్ ల మద్య 6 ఏళ్లు పేస్ బుక్ పరిచయం కాస్తా ప్రేమ గా మారడంతో 20 రోజుల క్రితం వీకోట మండలం ఆరిమాకులపల్లి కి లవ్ సీన్ మారింది. శ్రీలంక నుంచి వి కోట కు లొకేషన్ మారడంతో పెద్దల సమక్షంలో స్థానికంగా ఉన్న సాయిబాబా ఆలయంలో 15 రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు.

Love Marriage: ఎల్లలు దాటిన ఫేస్ బుక్ ప్రేమ.. చిత్తూరు యువకుడిని పెళ్లి చేసుకున్న శ్రీలంక యువతి.. ట్విస్ట్ ఏమిటంటే..
sri lankan girl chittoor boy love marriage
Raju M P R
| Edited By: Surya Kala|

Updated on: Jul 29, 2023 | 8:42 AM

Share

చిత్తూరు జూలై 29: ఫేస్ బుక్ పరిచయం ప్రేమగా మారి శ్రీలంక దాటి చిత్తూరు జిల్లాకు చేరుకుంది. చిత్తూరు జిల్లా వి కోట కు చెందిన లక్ష్మణ్ అనే యువకుడితో క్రితం 6 ఏళ్ల క్రితం ఫేస్ బుక్ లో శ్రీలంక యువతి విఘ్నేశ్వరి కి మధ్య పరిచయం అయింది. తాజాగా చిత్తూరు జిల్లా వి కోట మండలానికి చెందిన లక్ష్మణ్ అనే యువకుడుని పరిణయ మాడింది. విఘ్నేశ్వరి, తాపీ మేస్త్రీ లక్ష్మణ్ ల మద్య 6 ఏళ్లు పేస్ బుక్ పరిచయం కాస్తా ప్రేమ గా మారడంతో 20 రోజుల క్రితం వీకోట మండలం ఆరిమాకులపల్లి కి లవ్ సీన్ మారింది. శ్రీలంక నుంచి వి కోట కు లొకేషన్ మారడంతో పెద్దల సమక్షంలో స్థానికంగా ఉన్న సాయిబాబా ఆలయంలో 15 రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇక అంతా సుఖాంతమే అనుకునే సమయంలో ఇప్పుడు అసలు ట్విస్ట్ మొదలైంది. ఆగస్టు 6 నాటికి విఘ్నేశ్వరి వీసా గడువు ముగియండడం అసలు చిచ్చుకు కారణం అయింది.

శ్రీలంక యువతి ప్రేమ పెళ్లి పై ఆరా తీసిన పోలీసులు చిత్తూరు ఎస్పీ ఆఫీసుకు పిలిచి వీసా గడువు వివరాలు సేకరించడంతో టూరిస్ట్ వీసా గడువు ముగుస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో గడువు ముగిసే లోపు దేశం విడిచి వెళ్లాలని నోటీసులు జారీ చేశారు పోలీసు సిబ్బంది. శ్రీలంక లో ఉన్న విఘ్నేశ్వరి తల్లిదండ్రులకు సమాచారమిచ్చి విదేశీ యువతిని చట్టబద్దంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని పోలీసులు సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..