Jampanna Vagu: జలసమాది అయిన 8 మృతదేహాలు లభ్యం .. ఒక్కో కుటుంబానికి రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా
జంపన్నవాగు రెండు గ్రామాలను కకావికలం చేసింది.. గురువారం ఉదయం ఒక్కసారిగా జంపన్నవాగు మహోగ్రరూపం దాల్చింది వరద ప్రవాహం పెరుగుతున్న విషయాన్ని గమనించిన ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి - మల్యాల గ్రామ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు కట్టుబట్టలతో బయలుదేరారు.
వరంగల్ జూలై 29వ తేదీ: వరంగల్ ఉమ్మడి జిల్లాను అతలాకుతలం చేస్తున్న వర్షాలు వరదలు ఊహించిన విధంగా ఆస్తి నష్టం..ప్రాణ నష్టం కలిగించాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 19 మంది మృతి చెందారు. వారిలో కేవలం ఒక్క మల్యాల – కొండాయి గ్రామాలకు చెందినవారే ఎనిమిది మంది ఉన్నారు.. వరద ముప్పు నుండి ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరుగులు పెట్టిన ఆ గ్రామస్తులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.. వరదల్లో కొట్టుకుపోయి ఎనిమిది మంది జల సమాధి అయ్యారు. ఇప్పుడా గ్రామం శోకసముద్రంలో మునిగి పోయింది.
జంపన్నవాగు మహోగ్రరూపం దాల్చడంతో ఎనిమిది జల సమాధి అయ్యారు.. వూరిని వూహించని విషాదంలోకి నెట్టింది. ఊరంతా కన్నీళ్ల పర్యంతమయ్యేలా చేసింది. వందలాదిమంది జీవితాలు ఆగమయ్యాయి.. ఆమాయకుల ప్రాణాలు వరదల్లో కలిసిపోయాయి. జంపన్నవాగు రెండు గ్రామాలను కకావికలం చేసింది.. గురువారం ఉదయం ఒక్కసారిగా జంపన్నవాగు మహోగ్రరూపం దాల్చింది వరద ప్రవాహం పెరుగుతున్న విషయాన్ని గమనించిన ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి – మల్యాల గ్రామ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు కట్టుబట్టలతో బయలుదేరారు. కానీ వారిని వరద మింగేసింది.. ఒక్కసారిగా పెరిగిన జంపన్నవాగు వరద ఎనిమిది మంది ప్రాణాలను బలితీసుకుంది. ఎన్టీఆర్ బృందాలు, పోలీసులు, స్థానికులు ఎంత ప్రయత్నం చేసిన వారి ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు..ఈ ప్రమాదంలో రషీద్, కరీమా, లాల్ బీ, మహబూబ్, సమ్మక్క, మజీద్, అజ్జు, షరీఫ్ అనే ఎనిమిది మంది జలసమాధి అయిపోయారు.
ఒక రోజంతా గాలింపు చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు, స్థానికులు ఈ 8 మంది మృత దేహాలను గ్రామ శివారులోని పంటపొలాలు, చెట్ల పొదల్లో గుర్తించారు. ఏటూరునాగారం ఏరియా ఆసుపత్రి మార్చిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.
వరదల ప్రభావంతో అల్లాడుతున్న ఈ రెండు గ్రామాల ప్రజలు తీరని విషాదంతో తల్లడిల్లుతున్నారు. ఊరంతా బోరుమంటుంది. ప్రభుత్వం వరద ముప్పుతో ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులకు హెలికాప్టర్ ద్వారా నిత్యవసర వస్తువులు, వాటర్, మెడిసిన్ ద్వారా సరఫరా చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తక్షణ సాయం క్రింద 25 వేల రూపాయలు అందించారు. జిల్లా మంత్రి సత్యవతి రాథోడ్, స్థానిక ఎమ్మెల్యే సీతక్క అక్కడే ఉండి సహాయక చర్యలు అందిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..