Mulugu: జంపన్నవాగు మహోగ్ర రూపం.. జలదిగ్భంధంలోనే సమ్మక్క సారలమ్మ గద్దెలు..
ములుగు జిల్లాలో జంపన్నవాగు మహోగ్ర రూపం దాల్చింది. చరిత్రలో ఎన్నడూ లేనంత వరదలు రావడంతో.. పరిసర గ్రామాలు అస్తిత్వాన్నే కోల్పోయాయి. మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం ఇంకా జలదిగ్భంధంలోనే ఉంది. జంపన్న వాగు ఉధృతి కారణంగా కొండాయి, మల్యాల గ్రామాలు తల్లడిల్లిపోతున్నాయి. భారీవరదలు కొండాయి, మోరంచల్లి, మల్ల్యాయి గ్రామాలను ముంచెత్తాయి.
ములుగు జిల్లాలో జంపన్నవాగు మహోగ్ర రూపం దాల్చింది. చరిత్రలో ఎన్నడూ లేనంత వరదలు రావడంతో.. పరిసర గ్రామాలు అస్తిత్వాన్నే కోల్పోయాయి. మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం ఇంకా జలదిగ్భంధంలోనే ఉంది. జంపన్న వాగు ఉధృతి కారణంగా కొండాయి, మల్యాల గ్రామాలు తల్లడిల్లిపోతున్నాయి. భారీవరదలు కొండాయి, మోరంచల్లి, మల్ల్యాయి గ్రామాలను ముంచెత్తాయి. ఆగ్రామాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. మరోవైపు వరద తాకిడికి మోరంచపల్లి రూపురేఖలే మారిపోయాయి. అక్కడ ప్రస్తుతం పరిస్థితి కన్నీటి సంద్రాన్ని తలపిస్తోంది. నిన్నటి నుంచి సాయం కోసం ఎదురు చూస్తున్నారు బాధిత గ్రామాల ప్రజలు. కాగా, కొండాయికి చెందిన ఎనిమిది మందిని జంపన్న వాగు మింగేసింది. మృతదేహాలను ఎట్టకేలకు గుర్తించారు. ఇక జంపన్న వాగులో గల్లంతైన వారి కోసం డ్రోన్ కెమెరాలు, హై స్పీడ్ బోట్లతో గాలిస్తున్నారు. మరోవైపు వరదతో కొండాయి, దొడ్ల గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై బ్రిడ్జి కుంగిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సహాయక చర్యలను మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతిరాథోడ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
కాగా, జంపన్న వాగు వరద కారణంగా చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. తక్షణ సాయం కింద వారికి రూ. 25 వేల ఆర్థిక సాయం చేశారు. సర్వం కోల్పోయామంటూ బాధితుల ఆర్తనాదాలు విన్న మంత్రులు.. వరదలతో నష్టపోయిన వారిని ఆదుకుంటామని భరోసా కల్పించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..