AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liquor: బెల్ట్ షాపుల్లో మద్యం తాగుతున్నారా? భయంకరమైన న్యూస్ మీకోసమే..

పెద్దపల్లి జిల్లా కల్తీ మద్యానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. గతంలో సింగరేణి పారిశ్రామిక ప్రాంతం గోదావరిఖనిలో.. ఇష్టారాజ్యంగా మద్యాన్ని కల్తీ చేసేవారు. ఎలాంటి అనుమానం రాకుండా బాటిల్స్ పై క్యాప్ ఓపెన్ చేసి, కల్తీ చేశారు. పోలీసులు, ఎక్సైజ్ దాడులు..

Liquor: బెల్ట్ షాపుల్లో మద్యం తాగుతున్నారా? భయంకరమైన న్యూస్ మీకోసమే..
Liquor Scam
G Sampath Kumar
| Edited By: Shiva Prajapati|

Updated on: Jul 28, 2023 | 10:08 PM

Share

పెద్దపల్లి జిల్లా కల్తీ మద్యానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. గతంలో సింగరేణి పారిశ్రామిక ప్రాంతం గోదావరిఖనిలో.. ఇష్టారాజ్యంగా మద్యాన్ని కల్తీ చేసేవారు. ఎలాంటి అనుమానం రాకుండా బాటిల్స్ పై క్యాప్ ఓపెన్ చేసి, కల్తీ చేశారు. పోలీసులు, ఎక్సైజ్ దాడులు.. ఇలాంటి కల్తీరాయుళ్లను పట్టుకున్నారు. ఇప్పుడు.. ఈ జిల్లాలో కొత్త దందాకు తెర తీశారు అక్రమ మద్యం వ్యాపారులు. పెద్దపల్లి జిల్లాలో అనధికారికంగా.. 1500 లకు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి. మద్యం షాపుల నుంచి బెల్ట్ షాపులు కొనుగోలు చేసి ఇంటి వద్ద అమ్ముతున్నారు. గ్రామంలో మందు అలవాటు ఉండే వారు ఇక్కడ కొనుగోలు చేసి తాగుతారు. అయితే, ఫుల్ బాటిల్ తీసుకొని, క్వాటర్ చేసి విక్రయిస్తున్నారు. రేటు ఎక్కువ మద్యంలో చీప్ లిక్కర్‌ను కలుపుతున్నారు. చీప్ లిక్కర్.. ఎక్కువ శాతం కల్తీ అవుతుంది. బాటిల్ వేరైనప్పటికీ.. అందులో ఉండే మందు మాత్రం చీప్ లిక్కర్ ఉంటుంది. ఎవరికి అనుమానం రాకుండా పకడ్బందీగా దందా నడుపుతున్నారు. అనుమానం కూడా రాదు. ఎందుకంటే.. క్వార్టర్ ఆధారంగానే దీనిని విక్రయిస్తున్నారు. బెల్ట్ షాపుల్లో ఎక్కువ శాతం ఖాళీ బాటిల్ ద్వారానే మద్యాన్ని విక్రయిస్తుంటారు వ్యాపారులు. దీన్నే ఆసరాగా చేసుకుని, ముందుగానే మందు బాటిళ్లను ఓపెన్ చేస్తున్నారు.

వాస్తవానికి ప్రస్తుతం మద్యం షాపుల కన్నా.. బెల్ట్ షాపుల్లోనే అధికంగా మద్యం అమ్ముడుపోతుంది. ఒక్కో గ్రామంలో నాలుగు నుంచి ఐదు బెల్ట్ షాపులు ఉన్నాయి. ఎక్సైజ్ అధికారులకు ఈ దందా గురించి తెలిపినా పెద్దగా చర్యలు తీసుకోవడం లేదు. చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ దందా ప్రతి గ్రామంలో జరుగుతుంది. ఇటీవలి కాలంలో బెల్ట్ షాపుల సంఖ్య మరింత పెరిగిపోయింది. దీపం ఉన్నప్పుడే చక్కబెట్టుకోవాలన్న చందంగా.. మందు ప్రియులకు కూడా ఎలాంటి అనుమానం రాకుండా కల్తీ చేస్తున్నారు. గతంలో.. ఎక్సైజ్ అధికారులు కల్తీ మద్యాన్ని పట్టుకున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో వ్యాపారులు మరింత రెచ్చిపోతున్నారు. మద్యాన్ని కల్తీ చేసి ప్రజలకు అమ్ముతున్నారు. అసలు మ్యాటర్ తెలియని ప్రజలు.. ఆ కల్తీ మద్యాన్ని తాగి మంచాన పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. కల్తీ మద్యాన్ని నివారించాలని కోరుతున్నారు ప్రజలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..