Hyderabad: వర్షాలు ఆగినా కుక్కలు ఆగట్లే.. భయంతో అల్లాడిపోతున్న భాగ్యనరగ వాసులు..
సాధారణంగా ఎండల తీవ్రత వల్ల కుక్కలు చిరాకుగా ఉండి, నీళ్లు దొరక్క ఆకలితో మనుషులపై దాడులు చేస్తాయని అంటారు. అందుకే సమ్మర్లో కుక్కల దాడులు ఎక్కువగా జరుగుతుంటాయి అంటారు. కానీ హైదరాబాదులో ఎండలో మాయమై వర్షాకాలం మొదలై వానలు కురుస్తున్న వీధి కుక్కల దాడులు మాత్రం ఆగట్లేదు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా ఎండల తీవ్రత వల్ల కుక్కలు చిరాకుగా ఉండి, నీళ్లు దొరక్క ఆకలితో మనుషులపై దాడులు చేస్తాయని అంటారు. అందుకే సమ్మర్లో కుక్కల దాడులు ఎక్కువగా జరుగుతుంటాయి అంటారు. కానీ హైదరాబాదులో ఎండలో మాయమై వర్షాకాలం మొదలై వానలు కురుస్తున్న వీధి కుక్కల దాడులు మాత్రం ఆగట్లేదు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్న ఎండాకాలంలో వీధి కుక్కల దాడి వల్ల పిల్లలు చనిపోయిన సంఘటనలు అనేకం చూశాం. అప్పట్లో అధికారులు హడావిడి చేశారు. వీధి కుక్కల్ని చంపేయాలని సామాన్య ప్రజలు డిమాండ్ చేస్తే.. జంతు ప్రేమికులు అంతే స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేశారు. మరోవైపు జిహెచ్ఎంసి అధికారులు కుక్కలకు వ్యాక్సిన్లు, ఆపరేషన్ చేయిస్తామని చెప్పారు. అప్పుడు ఎండాకాలం తీరిపోతే ఈ కుక్కల దాడులు తగ్గుతాయని అందరూ అనుకున్నారు.
మల్కాజ్‌గిరిలోని గౌతమ్ నగర్ 141 డివిజన్ పరిధిలో వీధి కుక్క దాడి సంఘటన కలకలం రేపింది. గౌతమ్ నగర్ సర్వోదయ స్కూల్లో యూకేజీ చదువుతున్న సత్య అనే ఆరు సంవత్సరాల బాలుడు సాయంత్రం ఆడుకుంటుండగా 4 వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. కుక్కలు దాడి చేస్తున్న సమయంలో చుట్టుపక్కల వారు ఉన్నప్పటికీ.. భయంతో ముందుకు రాలేదు. అయితే, అటుగా వెళుతున్న ఓ మహిళ ధైర్యం చేసి పక్కనే ఉన్న కర్రతో కుక్కలపై దాడి చేసింది. దాంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడని స్థానికులు చెబుతున్నారు. అప్పటికే సత్య కుడి తొడ భాగంపై తీవ్రంగా దాడి చేశాయి. వెంటనే బాల్రెడ్డి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గౌతమ్ నగర్ లో వీధి కుక్కల సమస్య అధికంగా ఉందని, సంబంధిత అధికారులకు చాలాసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో తమ పిల్లలు ఎప్పుడూ బయట ఆడుకుంటూ ఉంటారని, ఇలాంటి సంఘటనలతో 24 గంటలు పిల్లల్ని కనిపెట్టుకొని ఉండాల్సి వస్తుందని అంటున్నారు.
ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయం వేస్తోందని స్థానికంగా ఉండే మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తమ కాలనీ నుండి వీధి కుక్కలను వెంటనే తరిమేయాలని.. లేదంటే మేమే వాటిని చంపేస్తామని అంటున్నారు. సంబంధిత అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా వీధి కుక్కలన్నింటికీ ఇప్పటికే వ్యాక్సిన్లు వేసామని జంతు సంరక్షణ చట్టంలో ఉన్న కొన్ని పరిమితుల కారణంగా కొన్ని విషయాల్లో వెనకడుగు వేయాల్సి వస్తుందని అన్నారు. వీధి కుక్కలను గాయపరిచిన చంపిన చట్టపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటే కాకుండా వాటిని హరించి వేసిన పర్యావరణ అసమతుల్యత సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు.
వైద్యులు కూడా ఎండాకాలంలోనే కుక్కల దాడులు అధికంగా ఉంటాయని వర్షాకాలంలో అంత ఉండకపోవచ్చు అని అంటున్నారు. వ్యాక్సిన్లు వేసిన కుక్కలు ఒకవేళ కరిచిన అంత ప్రమాదం ఉండదని చెబుతున్న వీధి కుక్కల దాడిలో చనిపోయిన చిన్నారులు అలాగే కుక్క కాటు వల్ల రెబిస్ వ్యాధి సోకి కొన్ని నెలల క్రితం ఒక వ్యక్తి చనిపోయినటువంటి సంఘటన గుర్తు చేసుకుని తల్లిదండ్రులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..