విపత్తు ఏదైనా వాళ్లు రంగంలోకి దిగారంటే వార్ వన్ సైడే.. ఇప్పటికే వందలాది మందిని.. వివరాలివే..
Telangana State Disaster Response and Fire Services: భారీ వర్షాల వల్ల జరిగిన జల ప్రళయం కల్లారా చూసాం. ఊర్లకు ఊర్లే నీటిలో కొట్టుకుపోయిన పరిస్థితి. వరంగల్ హనుమకొండ పట్టణాలైతే ఏకంగా నీళ్లలో తేలిపోయాయి. వరంగల్ రోడ్లమీద బస్సులు కార్ల బదులు బోట్స్ తిరిగాయి అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇటువంటి టైంలోనే తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగి సహాయక చర్యలను..

Telangana State Disaster Response and Fire Services: భారీ వర్షాల వల్ల జరిగిన జల ప్రళయం కల్లారా చూసాం. ఊర్లకు ఊర్లే నీటిలో కొట్టుకుపోయిన పరిస్థితి. వరంగల్ హనుమకొండ పట్టణాలైతే ఏకంగా నీళ్లలో తేలిపోయాయి. వరంగల్ రోడ్లమీద బస్సులు కార్ల బదులు బోట్స్ తిరిగాయి అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇటువంటి టైంలోనే తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపట్టారు. ఎక్కడెక్కడ ఎన్ని టీములు పనిచేశాయి.. ఎంత మందిని రక్షించారు.. ఇలాంటి సహాయక చర్యలు ఎన్ని చేపట్టారు.. ఎక్కడెక్కడ వరదల్లో కొట్టుకుపోతున్న వాళ్ళని లైవ్‌గా కాపాడారు.. ఇవన్నీ లెక్కలు చూస్తే వాళ్ళ పనితీరును సెల్యూట్ కొట్టక తప్పదు. ఆ వివరాలు చూద్దాం..
వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు కృషి చేసిన మొత్తం 18 టీంలు. రాష్ట్ర వ్యాప్తంగా వరదల్లో చిక్కుకున్న 1421 మంది ప్రాణాలు కాపాడారు ఈ టీమ్స్. మూగజీవాల ప్రాణాలను సైతం రెస్క్యూ చేశారు. భూపాలపల్లిలో, మొరాంచపళ్లిలో 70 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పెద్దపల్లి మంథని గోపాల్ పూర్ ఇసుక రీచ్ లో చిక్కుకున్న 17 మంది ప్రాణాలు కాపాడారు. వరంగల్‌లో మేజర్ గా 837 మంది ప్రాణాలు కాపాడారు ఈ సిబ్బంది. ఖమ్మంలో భవనాలపైకి ఎక్కి కాపాడాలని ఆర్తనాథాలు చేసిన 65 మందిని కాపాడింది ఈ డిజాస్టర్ రెస్పాన్స్ టీం. కరీంనగర్‌లో నలుగురు, సిరిసిల్ల లో 114 మంది , జగిత్యాల నిజామాద్ లో 107 మంది, నిర్మల్‌లో200 మంది ప్రాణాలు కాపాడిన సిబ్బంది.

తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ డిపార్ట్‌మెంట్ సాధించిన విజయాలు..
అలాగే నిర్మల్‌లో వరదలో కొట్టుకుపోతుండగా ఏడుగురు ప్రజలను ఐదు ఆవులను సిబ్బంది కాపాడారు.రాష్ట్ర వ్యాప్తంగా వరదల్లో కొట్టుకుపోతుండగా 28 మంది ప్రజలను లైవ్ గా కాపాడిన సిబ్బంది. ఇలా తమ ప్రాణాలకు ఉత్తేగించి ధైర్య సాహసాలతో రంగంలోకి దిగి ప్రజల ప్రాణాలను కాపాడారు. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి విపత్తు వచ్చిన బాహుబలిలా రంగంలోకి దిగి పనిచేయటం నిజంగా ప్రశంసనీయం.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..