Health Tips: మీకు 30 ఏళ్లు దాటాయా..? అయితే మీరు వీటిని తప్పక తాగాల్సిందే.. అప్పుడే ఆ సమస్యలకు చెక్..

Women's Health: మహిళలు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీసు బాధ్యతలతో నిత్యం సతమతమవుతుంటారు. ఈ క్రమంలో వారికి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకునే సమయం, తీరిక దొరకదు. ముఖ్యంగా 30 సంవత్సరాలు దాటిన మహిళలపై పిల్లల బాధ్యత కూడా ఉండడం వల్ల వారు తరచూ ఆలసిపోతుంటారు. ఈ క్రమంలోనే వారి శరీరంలోని కండరాలు, కాలేయం, మూత్రపిండాలు వంటి పలు ముఖ్య భాగాలపై..

Health Tips: మీకు 30 ఏళ్లు దాటాయా..? అయితే మీరు వీటిని తప్పక తాగాల్సిందే.. అప్పుడే ఆ సమస్యలకు చెక్..
Juices For Women
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 28, 2023 | 7:54 PM

Women’s Health: మహిళలు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీసు బాధ్యతలతో నిత్యం సతమతమవుతుంటారు. ఈ క్రమంలో వారికి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకునే సమయం, తీరిక దొరకదు. ముఖ్యంగా 30 సంవత్సరాలు దాటిన మహిళలపై పిల్లల బాధ్యత కూడా ఉండడం వల్ల వారు తరచూ ఆలసిపోతుంటారు. ఈ క్రమంలోనే వారి శరీరంలోని కండరాలు, కాలేయం, మూత్రపిండాలు వంటి పలు ముఖ్య భాగాలపై ప్రభావం పడుతుంది. ఇంకా ఎముకలు బలహీనపడడం, రోజువారీ పనుల్లో ఇబ్బందులు కలగడం, కళ్లు తిరగడం వంటి సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. ఈ నేపథ్యంలో మహిళలు ఆహారం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. లేకుంటే రానున్న కాలంలో మరిన్ని సమస్యల పాలవుతారు. ఇంకా చర్మం ముడతలు పడడం, జుట్టు సమస్యలు కూడా ఎదురవుతాయి.

అయితే కొన్ని రకాల ఆహారపు అలవాట్లు చేసుకున్నా, సప్లిమెంట్స్ తీసుకున్నా మహిళలు ఈ సమస్యలను నిరోధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆయా ఆహారాలు లేదా సప్లిమెంట్స్ కారణంగా శరీరానికి అంతర్గత పోషణ లభించి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించగలుగుతారు. అయితే అందరికీ సప్లిమెంట్స్‌ కోసం, వివిధ రకాల ఆహారాలను తినేందుకు కావాల్సిన ఖర్చు భారంగా అనిపించవచ్చు. ఈ నేపథ్యంలో 30 సంవత్సరాలు దాటిన మహిళలు కేవలం మూడు రకాల రసాలు తాగినా సరిపోతుందని నిపుణులు అంటున్నారు. మరి ఆ 3 రసాలేమిటో ఇప్పుడు చూద్దాం..

ఫ్రూట్ మిక్స్: వివిధ పండ్లను కలిపి తయారు చేసిన ఫ్రూట్ మిక్స్‌లో పలు రకాల పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంతో పాటు మెదడును చురుగ్గా ఉంచి, వాటి పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే రక్తపోటు, కొలెస్ట్రాల్‌ని నియంత్రించి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా మగువల కళ్లు, చర్మం, జుట్టును రక్షిస్తాయి.

ఇవి కూడా చదవండి

కొబ్బరి నీరు: కొబ్బరి నీళ్ల సహజంగానే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైనవి. అందుకే కొద్దిపాటి నీరసం ఉన్నా కొబ్బరి నీళ్లు తాగాలని పెద్దలు చెబుతుంటారు. ఇందులోని విటమిన్లు మన ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. ఇంకా శరీర వ్యాధినిరోధక శక్తిని మెరుగుపరిచి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇంకా చర్మ సమస్యలను నిరోధిస్తాయి.

వెజిటెబుల్ జ్యూస్: కూరగాయలను కూరల రూపంలో కంటే జ్యూస్‌గా తీసుకుంటేనే ఆరోగ్యానికి మేలు. ఇందులోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, జింక్, కెరోటినాయిడ్స్ వంటి పోషకాలు.. అధిక రక్తపోటు, రక్తహీనత, చర్మ సమస్యలను దూరం చేస్తాయి. ఇంకా నిరంతరం మిమ్మల్ని చురుగ్గా ఉంచుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే