Cancer: కేవలం 4 నిముషాలు ఇంటిపనితో క్యాన్సర్ దూరం.. పరిశోధకుల అధ్యయనంలో కీలక విషయాలు
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా అందులో కేన్సర్ పేరు ముందుంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం.. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్ల మంది ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే రోజూ కేవలం నాలుగు నిమిషాలు ఇంటి పనులు చేస్తే క్యాన్సర్ ముప్పు మూడు వంతులు తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయం పరిశోధకులు తమ అధ్యయనంలో క్యాన్సర్‌కు సంబంధించి పరిశోధన వివరాలను వెల్లడించారు.

ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా అందులో కేన్సర్ పేరు ముందుంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం.. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్ల మంది ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే రోజూ కేవలం నాలుగు నిమిషాలు ఇంటి పనులు చేస్తే క్యాన్సర్ ముప్పు మూడు వంతులు తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు.
12 రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ లభిస్తుంది:
ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయం పరిశోధకులు తమ అధ్యయనంలో క్యాన్సర్‌కు సంబంధించి పరిశోధన వివరాలను వెల్లడించారు. కష్టపడి ఇంటిపనులు చేయడం, బరువైన వస్తువులను తరలించడం, పిల్లలతో ఆడుకోవడం వల్ల క్యాన్సర్ నుంచి ఎంతో రక్షణ లభిస్తుందని చెప్పారు. చిన్నపాటి శ్రమతో రొమ్ము, ఊపిరితిత్తులతోపాటు 12 రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ పొందవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
సిడ్నీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఇమ్మాన్యుయేల్ స్టామటాకిస్ మాట్లాడుతూ.. డబ్బు ఖర్చు లేకుండా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఇది సలహా. ప్రతిరోజు కేవలం నాలుగైదు నిమిషాలు ఇంటి పనులు తక్కువ శ్రమతో చేస్తే కేన్సర్ ముప్పును తగ్గించుకోవచ్చని తెలిపారు.




ఏడేళ్లపాటు స్టడీ చేశాం..
ఆస్ట్రేలియన్ పరిశోధకుల అధ్యయనం JAMA ఆంకాలజీ జర్నల్‌లో ప్రచురించబడింది. ఇందులో ఫిజికల్ యాక్టివిటీ ద్వారా క్యాన్సర్ ఎలా ప్రభావితం అవుతుందో పేర్కొంది. ఏడేళ్లపాటు 22,000 మంది వ్యక్తులపై చేసిన అనేక అధ్యయనాలు ఎక్కువ శారీరక శ్రమ చేసే వ్యక్తులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని తేలింది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




