Health Tips: బాలింతలు అస్సలు ట్యాబ్లెట్స్ వేసుకోకూడదా? వేసుకుంటే ఏమౌతుందో తెలుసుకోండి!!
పాలిచ్చే తల్లులకు ఎక్కడ లేని జాగ్రత్తలు చెబుతూంటారు ఇంట్లోని పెద్దలు. అవి తినకూడదు.. ఇలా తిరగకూడదు.. అలా ఉండకూడదు అంటూ ఎక్కడ లేని కండీషన్స్ పెడుతూంటారు. కొన్ని రకాల పనులు చేయడాన్ని కూడా వద్దని వారిస్తూంటారు. ఇక బాలింతలకు జ్వరం, దగ్గు, జలుబు..
పాలిచ్చే తల్లులకు ఎక్కడ లేని జాగ్రత్తలు చెబుతూంటారు ఇంట్లోని పెద్దలు. అవి తినకూడదు.. ఇలా తిరగకూడదు.. అలా ఉండకూడదు అంటూ ఎక్కడ లేని కండీషన్స్ పెడుతూంటారు. కొన్ని రకాల పనులు చేయడాన్ని కూడా వద్దని వారిస్తూంటారు. ఇక బాలింతలకు జ్వరం, దగ్గు, జలుబు వచ్చినా మందులు వేసుకోవద్దని చెబుతూంటారు. మరి పాలిచ్చే తల్లులు మందులు వేసుకోవద్దా? పెద్దలు చెప్పేదాంట్లో నిజం ఎంత? అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
-పాలిచ్చే తల్లులు ఎలాంటి అపోహలు పట్టించుకోకుండా ట్యాబ్లెట్లు వేసుకోవచ్చు. బాలింతలు వేసుకునే మందులు పాలలో కలుస్తాయని అంటూంటారు. కానీ ఇది ఎంతమాత్రం నిజం కాదు. దీని వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. వీటి గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అందులోనూ వైద్యులు సూచించిన మందులు వాడటం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు.
-బాలింతలు అనారోగ్యంగా ఉంటే.. ఇంట్లో రెమిడీ ట్రై చేయవచ్చు. అయితే అన్ని సార్లు హోమ్ రెమిడీస్ తో ఫలితం ఉండకపోవచ్చు. కొన్ని సార్లు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి కొత్తగా హోమ్ రెమిడీస్ ట్రై చేసేటప్పుడు కాస్త తక్కువ మోతాదులో తీసుకోవడం మంచింది.
-ప్రిస్క్రిప్షన్ మందులైనా, ఓవర్-ది-కౌంటర్ మందులైనా రెండూ పాలిచ్చే తల్లులకు హానికరం కాదు. అయినప్పటికీ.. ఏమైనా మందులు తీసుకునే ముందు సంబంధిత వైద్యులను సంప్రదించడం బెటర్ ఛాయిస్.
-అలాగే పాలిచ్చే తల్లులు మెడిసన్స్ తీసుకుంటూ కూడా పాలు ఇవ్వవచ్చు. వైద్యులను సంప్రదించి వారు సూచించిన మందులను వాడుతూ చక్కగా పాలు ఇవ్వవచ్చు. వారి సూచన మేరకు చికిత్స తీసుకుంటే జబ్బులు తగ్గే అవకాశం ఉంటుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి