Disadvantages of Mouthwash: నోరు శుభ్రం చేసుకునేందుకు వాటిని వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. మీరు రిస్క్‌లో పడ్డట్లే..!
నోటి దుర్వాసన అనేది వివిధ కారణాల వల్ల ఉంటుంది. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం కారణంగా ఆధారపడి ఉంటుంది. అలాగే లేచిన వెంటనే సరిగ్గా ముఖం కడుక్కోకపోయినా దుర్వాసన సమస్య వేధిస్తూ ఉంటుంది. ఈ సమస్య కారణంగా నలుగురిలో ఆత్మవిశ్వాసంతో మాట్లాడలేని పరిస్థితి నెలకొంటుంది.
నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని అంటూ ఉంటారు. ఇది చెడు మాటలు మాట్లాడి ఊరికే గొడవలు పెట్టుకుంటూ ఉండే వారి గురించి పేర్కొంటూ ఈ సామెత పుట్టింది. అయితే మనం ఎదుటివారితో మాట్లాడే సమయంలో మన నోటి నుంచి దుర్వాసన వస్తే వారు ఇబ్బందిగా ఫీలవుతారు. నోటి దుర్వాసన అనేది వివిధ కారణాల వల్ల ఉంటుంది. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం కారణంగా ఆధారపడి ఉంటుంది. అలాగే లేచిన వెంటనే సరిగ్గా ముఖం కడుక్కోకపోయినా దుర్వాసన సమస్య వేధిస్తూ ఉంటుంది. ఈ సమస్య కారణంగా నలుగురిలో ఆత్మవిశ్వాసంతో మాట్లాడలేని పరిస్థితి నెలకొంటుంది. ఈ సమస్య నుంచి రక్షణకు చాలా మంది మౌత్ వాష్‌లను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో వీటి వాడకం విపరీతంగా పెరిగింది. దీంతో పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా వివిధ కంపెనీలు మౌత్ వాష్‌లను తయారు చేస్తున్నాయి. అయితే ఈ మౌత్ వాష్ విరివిగా వాడడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు వేధిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మౌత్‌వాష్‌ల గురించి ఓ సారి తెలుసుకుందాం.
మీ నోటికి మెరిసే, చల్లగా, జలదరించే అనుభూతిని ఇవ్వడమే కాకుండా మౌత్‌వాష్‌ను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల అనేక ప్రతికూలతలు ఉన్నాయి. మౌత్ వాష్ అనేది బ్రష్ చేసిన తర్వాత మన సాధారణ జీవితంలో భాగమైన నోటిని శుభ్రం చేసే ప్రక్రియ. నోటి పరిశుభ్రతకు మౌత్ వాష్ మంచిదని భావించే వారు దాని ప్రతికూలతలు తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.
- మంచి, చెడు బాక్టీరియా రెండూ మన నోటిలో ఉంటాయి. కాబట్టి మౌత్ వాష్‌తో మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. అయితే మంచి బ్యాక్టిరియా మన ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి మౌత్‌వాష్ వల్ల జీర్ణక్రియకు కీడు చేస్తుంది.
- మౌత్ వాష్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల నోరు పొడిబారుతుంది.
- మౌత్ వాష్ ఉపయోగించిన తర్వాత మీరు పళ్లు తోముకుంటే మీరు నొప్పి మరియు సున్నితత్వంతో బాధపడవచ్చు.
- మీరు ఎక్కువగా మౌత్ వాష్ ఉపయోగిస్తే మీ చిగుళ్ళ నుంచి రక్తస్రావం జరగవచ్చు.
- 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మౌత్ వాష్ వాడకం అత్యంత ప్రమాదకరం.
- మౌత్ వాష్ మీకు సరిపోకపోతే, మీకు ఈ సమస్యలు ఏవైనా ఉంటే, వెంటనే మౌత్ వాష్ వాడటం మానేయడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..