AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

French Fries: ఫ్రెంచ్ ఫ్రైస్.. ఇలా చేస్తే అచ్చం రెస్టారెంట్ స్టైల్లో వస్తాయి

మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా ఇష్టమా.. తరుచుగా వాటిని కొని తింటున్నారా? అయితే బయట అవి కాస్ట్ ఎక్కువ. అదే మరి మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఎంత కావాలంటే.. అంత తొనొచ్చు. రెస్టారెంట్ స్టైల్ లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంట్లో కూడా..

French Fries: ఫ్రెంచ్ ఫ్రైస్.. ఇలా చేస్తే అచ్చం రెస్టారెంట్ స్టైల్లో వస్తాయి
French Fries
Chinni Enni
|

Updated on: Jul 27, 2023 | 10:50 PM

Share

మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా ఇష్టమా.. తరుచుగా వాటిని కొని తింటున్నారా? అయితే బయట అవి కాస్ట్ ఎక్కువ. అదే మరి మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఎంత కావాలంటే.. అంత తొనొచ్చు. రెస్టారెంట్ స్టైల్ లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు బంగాళాదుంప ప్రియులైతే, మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని తెలుసుకోవాలనుకుంటారు. మరి వాటిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

అసలే ఇప్పుడు వర్సాలు కురుస్తున్నాయి. సాయంత్రం అయిందంటే వేడి వేడగా ఏమన్నా తినాలనిపిస్తుంది. అందులోనూ పెద్దగా ప్రాసెస్ లేకుండా సింపుల్ గా అవ్వాలంటే.. ఫ్రెంచ్ ఫ్రైస్ కరెక్ట్. మరి ఇంకెందుకు ఆలస్యం వీటిని తయారు చేసుకుందామా.

ముందుగా బంగాళదుంప తొక్క తీసి పొడవుగా కట్ చేసుకోవాలి. బంగాళాదుంపను కత్తిరించేటప్పుడు చాలా మందంగా లేదా చాలా సన్నగా లేకుండా చూసుకోండి. తర్వాత కట్ చేసిన బంగాళదుంపలను ఒకసారి ఉప్పు నీళ్లలో కడిగి చల్లటి నీళ్లలో 10-15 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత పొయ్యి మీద మందపాటి గిన్నె లేదా మూకిడి పెట్టి తగినంత నూనె పోసుకోవాలి.

ఇవి కూడా చదవండి

నూనె వేడి అయ్యాక మంట తగ్గించి ముందుగా బంగాళదుంప ముక్కలను వేసి కరకరలాడే వరకు వేయించాలి. వేయించిన బంగాళదుంప ముక్కలను టిష్యూ పేపర్ మీద వేసి చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, మీకిష్టమైతే చిల్లీ ఫ్లేక్స్ కూడా చల్లుకుంటే రుచికరమైన ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. ఇది టొమాటో సాస్‌తో అద్భుతమైన రుచిగా ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్