AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peanuts Benefits: గుప్పెడు పల్లీలతో అద్భుతం.. ఎన్నికేలరీల శక్తి, ప్రొటీన్లు అందుతాయో తెలుసా!!

ఇప్పుడున్న ఆహారపు అలవాట్లకు.. శరీరానికి తగిన మోతాదులో బలం కావాలంటే అంత తేలిక కాదు. అతిగా తింటే బలం వస్తుందనుకుంటే పొరపాటే. అలాగని గుడ్లు, పాలు, మాంసం, ఆకుకూరలు, పండ్లు మాత్రమే బలమైన ఆహారాలు కావు. వీటన్నింటికంటే పల్లీలు..

Peanuts Benefits: గుప్పెడు పల్లీలతో అద్భుతం.. ఎన్నికేలరీల శక్తి, ప్రొటీన్లు అందుతాయో తెలుసా!!
Peanuts Benefits
Chinni Enni
|

Updated on: Jul 27, 2023 | 9:44 PM

Share

ఇప్పుడున్న ఆహారపు అలవాట్లకు.. శరీరానికి తగిన మోతాదులో బలం కావాలంటే అంత తేలిక కాదు. అతిగా తింటే బలం వస్తుందనుకుంటే పొరపాటే. అలాగని గుడ్లు, పాలు, మాంసం, ఆకుకూరలు, పండ్లు మాత్రమే బలమైన ఆహారాలు కావు. వీటన్నింటికంటే పల్లీలు (వేరుశనగ) బలమైనవని చెబుతున్నారు నిపుణులు. అదేంటి వేరుశెనగ కొవ్వు కదా అనే కదూ మీకిప్పుడు వచ్చిన అనుమానం. అస్సలు కాదండి.. తినాల్సిన మోతాదులో.. డైట్ లో భాగంగా తీసుకుంటే అవి కూడా ఆరోగ్యానికి మంచే చేస్తాయి. శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి. వేరుశెనగ తినడం వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో చూద్దాం.

-రోజూ ఒక గుప్పెడు పల్లీలు.. సుమారుగా 100 గ్రాముల పల్లీలు తీసుకుంటే.. 567 క్యాలరీల శక్తి, 25 గ్రాముల ప్రొటీన్, 45 గ్రాముల కొవ్వు, 705 మిల్లీగ్రాముల పొటాషియం, 9 గ్రాముల ఫైబర్, 25 శాతం ఐరన్, 15 శాతం విటమిన్ బి, 42 శాతం మెగ్నీషియం, 9 శాతం క్యాల్షియం ఉంటుంది.

-పల్లీల్లో నూనె శాతం ఉంటుంది కాబట్టి.. 10 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించి లేదా నానబెట్టి తినొచ్చు. ఇలా తింటే వాతం సమస్య కూడా ఉండదు.

ఇవి కూడా చదవండి

-గర్భిణీ స్త్రీలు, బరువు పెరగాలనుకునేవారు, బాలింతలు పల్లీలను వేయించుకుని తినొచ్చు.

-ప్రతిరోజూ పల్లీలను ఆహారంలో తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన ప్రొటీన్లు, పోషకాలు లభిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గి.. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.

-ఎముకలలో ధృడత్వం పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

-జీడిపప్పు, బాదంపప్పుల్లా ధర కూడా ఎక్కువగా ఉండదు కాబట్టి.. ప్రతిఒక్కరికీ ఇవి అందుబాటులో ఉంటాయి. తక్కువ ధరకే కావల్సినన్ని పోషకాలు లభిస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్