Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidney Health: కిడ్నీలో రాళ్లున్నాయా.. ఈ ఒక్క ఆకు తింటే ఇట్టే కరిగిపోతాయ్!!

రీరంలో పేరుకున్న క్యాల్షియం, ఆక్సలేట్స్, యూరిక్ యాసిడ్, విషపదార్థాలు, వ్యర్థాలు పూర్తిస్థాయిలో మూత్రంద్వారా బయటకు వెళ్లకపోతే.. అవి మూత్రపిండాల్లో చిన్న చిన్న స్ఫటికలను ఏర్పరుస్తాయి. వీటికి మరిన్ని వ్యర్థాలు తోడవ్వడంతో అవి రాళ్లలా..

Kidney Health: కిడ్నీలో రాళ్లున్నాయా.. ఈ ఒక్క ఆకు తింటే ఇట్టే కరిగిపోతాయ్!!
Kidney Stones
Follow us
Chinni Enni

|

Updated on: Jul 26, 2023 | 9:22 PM

ఆధునిక జీవనశైలి అంటూ.. పాశ్చాత్య పోకడలకు పోయి.. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ ఏదిపడితే అది లాగించేయడం.. ఆ తర్వాత అనారోగ్యం పాలైతే లబోదిబోమంటూ డాక్టర్ల వద్దకు పరుగుతీయడం షరా మామూలైపోయింది. ఆ రోగం.. ఈ రోగమన్న తేడా లేదు. ఈ వయసు వారికే ఈ రోగం వస్తుందనీ లేదు. మారిన ఆహారపు అలవాట్లు.. రకరకాల రోగాలను తెచ్చిపెడుతున్నాయి. కిడ్నీల్లో రాళ్ల సమస్య ఎదుర్కొంటున్న వారు ఎక్కువగా ఉంటున్నారు. అందుకు అనేక కారణాలుంటాయి.

శరీరంలో పేరుకున్న క్యాల్షియం, ఆక్సలేట్స్, యూరిక్ యాసిడ్, విషపదార్థాలు, వ్యర్థాలు పూర్తిస్థాయిలో మూత్రంద్వారా బయటకు వెళ్లకపోతే.. అవి మూత్రపిండాల్లో చిన్న చిన్న స్ఫటికలను ఏర్పరుస్తాయి. వీటికి మరిన్ని వ్యర్థాలు తోడవ్వడంతో అవి రాళ్లలా మారుతాయి.

నీరు తక్కువగా తాగడం, అతిగా క్యాల్షియం ట్యాబ్లెట్లు వాడటం, ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడటం, అతిగా మద్యపానం, ధూమపానం చేయడం వల్ల కూడా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. ఫలితంగా విపరీతమైన కడుపునొప్పి, జ్వరం, వాంతులు, ఆకలి మందగించడం, మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి వంటి అనారోగ్య సమస్యలు దరిచేరుతాయి. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడ్డాయనేందుకు ఇవే సంకేతాలు.

ఇవి కూడా చదవండి

మరి కిడ్నీల్లో రాళ్లను ఎలా తొలగించుకోవాలి ? వైద్యులను సంప్రదిస్తే చిన్నదానికి, పెద్దదానికీ ఆపరేషన్ అంటారు. చాలామందికి ఆ మాట వినగానే వణుకు మొదలవుతుంది. ఆపరేషన్ లేకుండా.. ఎలాంటి మందులు వాడకుండా.. ఒకే ఒక్క ఆకు రోజూ తిన్నా.. ఆ ఆకు రసం తాగినా కిడ్నీల్లో రాళ్లు కరిగి మూత్రవిసర్జన ద్వారా బయటకు వచ్చేస్తాయి. ఏంటా ఆకు అనేగా మీ అనుమానం.

కొండపిండి ఆకు. ఇది పల్లెటూళ్లలో పొలం గట్లపై ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది. దీనిని సంస్కృతంలో పాపాఫభేది అని కూడా పిలుస్తారు. కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారు ఉదయాన్నే పరగడుపున బ్రేక్ ఫాస్ట్ కు అరగంట ముందు.. కొండపిండి ఆకుల నుంచి తీసిన రసాన్ని ఒక టీ గ్లాసు తాగితే చాలు. లేదా ఆకులను ఎండబెట్టి పొడి చేసుకుని.. రోజూ 2 టీ స్ఫూన్ల పొడిని అరగ్లాసు నీటిలో కలిపి తాగాలి. ఇలా క్రమం తప్పకుండా తాగితే.. కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయి. ఇలా సుమారు 20-30 రోజుల వరకూ తాగాలి. అలాగే రోజుకు 4-5 లీటర్ల నీటిని కూడా తాగాలి. అప్పుడే మంచి ఫలితాలుంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి