AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: మెడిసిన్స్ కాకుండా.. ఇంటి చిట్కాలతో డయాబెటీస్ కి బైబై చెప్పండి!!

యాబెటిస్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగించే ఇంగ్లీషు మందులతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చాలా మంది ఆందోళన పడుతూంటారు. అలాంటి వారు ఇంటి చిట్కాలతో కూడా మధువేహాన్ని కంట్రోల్..

Diabetes: మెడిసిన్స్ కాకుండా.. ఇంటి చిట్కాలతో డయాబెటీస్ కి బైబై చెప్పండి!!
Diabetics Control
Chinni Enni
|

Updated on: Jul 26, 2023 | 3:27 PM

Share

డయాబెటీస్ (మధుమేహం).. ఇప్పుడు ఈ సమస్యనే సమాజాన్ని పట్టిపీడిస్తోంది. వందలో 80 మంది డయాబెటీస్ తో బాధపడుతున్నవారే ఉన్నారు. మధువేహం కారణంగా శరీరంలోని అనేక అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంది. దీన్ని కనుక కంట్రోల్ లో పెట్టుకోకపోతే.. ఆ తర్వాత చాలా సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. మెల్లమెల్లగా శరీర అవయవాలపై మధుమేహం దాడి చేస్తుంది. డయాబెటిస్ వాళ్ళు అవసరమైన జాగ్రత్తలు తీసుకోక పోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అయితే డయాబెటిస్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగించే ఇంగ్లీషు మందులతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చాలా మంది ఆందోళన పడుతూంటారు. అలాంటి వారు ఇంటి చిట్కాలతో కూడా మధువేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు.

-మధుమేహాన్ని కంట్రోల్ చేయడంలో మెంతులు మంచి పాత్రను పోషిస్తాయి. ప్రతి రోజూ ఒక పరిమితిలో మెంతులను మన ఆహారంలో భాగంగా చేర్చుకుంటే డయాబెటిస్ ను అదుపులోకి తీసుకురావచ్చు. అలాగే రాత్రి సమయంలో మెంతులను నానబెట్టి.. ఉదయం ఆ నీళ్లను తాగి.. ఆ మెంతులను తింటే కూడా మధుమేహం కంట్రోల్ లోకి రావచ్చు.

ఇవి కూడా చదవండి

-మధుమేహాన్ని నియంత్రించడంలో కాకరకాయ ముఖ్యంగా పని చేస్తోంది. కాకర రసాన్ని తాగడం వల్ల ప్రయోజనం చేకూరుతుందని పలు అధ్యయనాల్లో కూడా వెల్లడైంది. పచ్చి కాకర కాయలు తిన్నా, కాకరకాయ రసాన్ని తాగిన రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయని చెబుతున్నారు. ప్రతిరోజు మనకు అందుబాటులో ఉండే, ఎప్పటికీ దొరికే చిన్న చిన్న పదార్థాలతోనే మధుమేహాన్ని కట్టడి చేయవచ్చని సూచిస్తున్నారు.

-అలాగే కరివేపాకులో కూడా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే గుణాలు ఉంటాయని చెబుతున్నారు. అందుకే కరివేపాకును ప్రతిరోజు 2 రెమ్మలు తుంచుకుని తింటే ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

-షుగర్ తో బాధపడే వారు శారీరకంగా చాలా యాక్టీవ్ గా ఉండాలి. ప్రతిరోజు వ్యాయమం చేయడానికి సమయం కేటాయించాలి. 15 నిమిషాల పాటు కనీసం మోడరేట్ ఎక్సర్సైజ్ చేయాలి. దీంతో మూడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలానే గ్లూకోజ్ లెవెల్స్ కూడా బాగుంటాయి

-మధుమేహంతో బాధపడేవారు ఫ్రై పదార్థాలు, ప్యాకెడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ కి చాలా దూరంగా ఉండాలి. అలాగే ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ.. ఒత్తిడిని దరిచేరనివ్వకుండా ఉంటే షుగర్ కి బైబై చెప్పవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై తుపాకీతో కాల్పులు..!
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై తుపాకీతో కాల్పులు..!
ఆటలో కోహ్లీని మించిన తోపు.. సెలెక్టర్ల దృష్టిలో పనికిరానోడు
ఆటలో కోహ్లీని మించిన తోపు.. సెలెక్టర్ల దృష్టిలో పనికిరానోడు
10 గ్రాముల బంగారు గొలుసుపై లోన్‌ తీసుకుంటే ఎంత డబ్బు వస్తుంది?
10 గ్రాముల బంగారు గొలుసుపై లోన్‌ తీసుకుంటే ఎంత డబ్బు వస్తుంది?
నిద్రలో ఉన్న భార్యను కాల్చి చంపేందుకు భర్త యత్నం..!
నిద్రలో ఉన్న భార్యను కాల్చి చంపేందుకు భర్త యత్నం..!